మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్-ఇండియా స్పెక్టాకిల్ ‘పెద్ది’ పై అంచనాలు మొదటి షాట్ గ్లింప్స్ విడుదలైన క్షణం నుంచే ఆకాశాన్ని తాకాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ సినిమా, ప్రతి అప్‌డేట్‌తో ప్రేక్షకుల్లో ఉత్కంఠను మరింత పెంచుతోంది. ఈ హైప్‌ను ఇంకో స్థాయికి తీసుకెళ్లింది ఫస్ట్ సింగిల్‌గా వచ్చిన “చికిరి చికిరి”.
ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ పాట చాలా తక్కువ సమయంలోనే రెండు భారీ మైలురాళ్లను అందుకుంది. రగ్డ్ లుక్‌లో రామ్ చరణ్ కనిపిస్తూ, అద్భుతమైన డాన్స్ మూవ్స్‌తో ఈ పాట, తెలుగులో మాత్రమే 100 మిలియన్ వ్యూస్‌ను దాటింది. ఇక ఐదు భాషల్లో కలిపి చూస్తే మొత్తం వ్యూస్ సంఖ్య 150 మిలియన్లను దాటి సంచలనం సృష్టించింది.
ఈ సీజన్‌కు అసలైన ట్రేండింగ్ పాట గా మారిన “చికిరి చికిరి”, కేవలం భారత్‌లోనే కాదు… వేరే దేశాల్లో లో కూడా ట్రెండింగ్‌లో ఉంది. పాటకు వస్తున్న స్పందన చూస్తుంటే, రామ్ చరణ్ గ్లోబల్ క్రేజ్ మరోసారి స్పష్టంగా కనిపిస్తోంది. రోజు రోజుకీ పాట పాపులారిటీ పెరుగుతుండటంతో, రాబోయే రోజుల్లో ఈ నంబర్లు ఇంకా భారీగా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఈ వేగంతో చూస్తే, “చికిరి చికిరి” ఆల్‌టైమ్ బిగ్గెస్ట్ చార్ట్‌బస్టర్స్‌లో ఒకటిగా నిలవడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో పెద్ది సినిమాపై ప్రీ-రిలీజ్ హైప్‌ను ఈ పాట మరింతగా పెంచి, రామ్ చరణ్ అభిమానుల్లో పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది.