రామ్ పోతినేని… అసలు తన ఎనర్జీ స్క్రీన్ మీద చూస్తుంటే, సినిమా అలా చూస్తూ ఉండాలి అనిపిస్తుంది అంతే! ఇక ఈ మధ్య కొన్ని ప్లాప్ సినిమాలు ఎదురైనా, ఇప్పుడు మళ్ళి సరికొత్తగా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అని ఇక ఫ్యాన్ బాయ్ సినిమా చేస్తున్నాడు…
ఈ సినిమా లో రామ్ హీరో ఉపేంద్ర కి ఒక పెద్ద ఫ్యాన్ గా కనపడి, అసలు ఫాన్స్ ఎలా ఉంటారు, వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి అని కళ్ళకు కట్టినట్టు చూపిస్తాడట! ఇక సినిమా రిలీజ్ డేట్ కూడా దెగ్గర పడుతుండడం తో, ప్రమోషన్స్ మొదలైపోయాయి.
ఆల్రెడీ టీజర్ ఇంకా ఫస్ట్ సాంగ్ “నువ్వుంటే చాలే…” చూసాం… ఇప్పుడు సెకండ్ పాట “చిన్ని గుండెలో…” రాబోతోంది. ఫస్ట్ పాత మొత్తం రొమాంటిక్ సాంగ్ కాగా, సెకండ్ సాంగ్ మొత్తం హీరో గారి ఫ్లర్టింగ్ వేషాలు చూపిస్తుంది. ఈ పాట 31st అక్టోబర్ న రిలీజ్ అవుతుంది…
రామ్ ఈ విషయాన్ని సోషల్ మీడియా లో పోస్ట్ చేసి, ఫాన్స్ ని ట్రీట్ చేసాడు!