తెలుగు సినిమా ఆస్థాన anchor సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పాలా??? అసలు తాను లేని మూవీ ఈవెంట్స్ ఊహించుకోలేం అంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు తన లెగసె కొనసాగించడానికి కొడుకు రోషన్ కనకాల వస్తున్నాడు హీరో గా! ఈ కుర్ర హీరో కొంచం డిఫరెంట్ సినిమా ‘మౌగ్లీ’ తో మన ముందుకు రాబోతున్నాడు…
ఈ సినిమా రిలీజ్ డేట్ దెగ్గరపడుతుండడం తో ఫస్ట్ సాంగ్, “సయ్యారే…” పాట రిలీజ్ చేసారు. ఈ ఫారెస్ట్ అడ్వెంచర్ సినిమా లో రొమాంటిక్ సాంగ్ భలే బాగుంది. అలానే చంద్రబోస్ లిరిక్స్ ఇంకా కాల భైరవ, ఐశ్వర్య దారూరి వాయిస్ కూడా భలే స్మూత్ గా ఉన్నాయ్…
ఈ పాట తో సినిమా పై అంచనాలు పెరిగాయి అని చెప్పచు… అలానే ఈ సినిమా ని కలర్ ఫోటో దర్శకుడు సందీప్ తెస్తున్నాడు కాబట్టి, ఆ హైప్ కూడా ఉంది. రోషన్ కి సినిమా అంటే ఎంత ఇష్టమో చాల ఇంటర్వ్యూ లో చెప్పాడు… అలానే సినిమా కోసం ఏదైనా చేస్తా అని, అందుకే ఈ ఫారెస్ట్ అడ్వెంచర్ సినిమా ని ప్రాణం పెట్టి చేసానని కూడా చెప్పాడు…
మొత్తానికి సినిమా చూడాలంటే మాత్రం 12th డిసెంబర్ వరకు ఆగాల్సిందే!