మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్ఘ తేజ్ పుట్టినరోజు సందర్భంగా, ఆయన నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సంబరాల యేటిగట్టు’ చిత్ర బృందం తాజాగా ‘అసుర ఆగమన’ గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ చిత్రం గ్లింప్స్ ప్రేక్షకుల్లో సినిమా పై అంచనాలు పెంచేసింది…
వీడియోలో చూపించినట్లు, ‘అసుర ఆగమన’ అనేది ఒక నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఓ ధైర్యవంతుడి కథలా కనిపిస్తోంది. శోషణను తట్టుకోలేని ప్రజల తరఫున పోరాడే హీరో భావోద్వేగంతో నిండిన పోరాటం చూపిస్తాడు. ఈ కథలోని ఆవేశం, న్యాయం కోసం జరగబోయే యుద్ధం — వీటన్నీ ప్రేక్షకుల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి.
సాయి దుర్ఘ తేజ్ లుక్ మాత్రం షాకింగ్‌గా ఉంది. తన కొత్త లుక్, టోన్డ్ బాడీ, కళ్ళలో కనిపించే ఆవేశం చూసి అభిమానులు మంత్ర ముగ్ధులైపోతున్నారు. ఈ పాత్ర కోసం ఆయన పూర్తిగా ఒక బాడీ ట్రాన్సఫార్మ్ చేసుకున్నాడు… ఇదే ఆయన కెరీర్‌లో అత్యంత ఇన్టెన్స్ అవతార్ అని చెప్పొచ్చు.
బి అజనీష్ లోకనాథ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం హైలైట్‌గా నిలిచింది — మొదట గిరిజన డ్రమ్స్‌తో మొదలై, తరువాత వార్‌లా ఆర్కెస్ట్రల్ బీట్స్‌గా మారుతూ హీరో ఎమోషన్‌కి బలాన్నిస్తోంది.
మొత్తం మీద ‘అసుర ఆగమన’ గ్లింప్స్ సాయి దుర్ఘ తేజ్ సినిమా మీద ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ ని మరింత పెంచింది. విజువల్ ప్రెజెంటేషన్, మ్యూజిక్, యాక్షన్ అన్నీ కలిపి ఇది పాన్ ఇండియా స్థాయిలో ఒక బ్లాక్‌బస్టర్‌గా నిలిచే అవకాశాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి.