సమంత… రాజ్… ఈ జంట తరచుగా కనిపిస్తుండడం తో అనుమానాలు కాస్త బలంగా మారుతున్నాయి! ఒక వైపు దీపావళి సెలెబ్రేషన్స్ పిక్స్, ఇంకో వైపు బర్త్డే పిక్స్, ఇప్పుడు సమంత తన కొత్త సినిమా ‘మా ఇంటి బంగారం’ లాంచ్ ఈవెంట్ పిక్స్… ఈ అన్నిట్లో రాజ్ ఉన్నాడు! వాళ్లిద్దరూ official గా తమ రేలషన్ షిప్ కంఫర్మ్ చేస్తే సమంత ఫాన్స్ అందరికి ఆనందమే కదా! సమంత కూడా తన లైఫ్ లో సెటిల్ అవ్వాలని ప్రతి ఒక్కరికి ఉంది… అది మన అందరి కోరిక కూడా!
ఇక మా ఇంటి బంగారం సినిమా విషయానికి వస్తే, ఈ సినిమా కి ‘ఓ బేబీ’ ఫేమ్ నందిని రెడ్డి డైరెక్టర్… ఈ సినిమా లాంచ్ ఈవెంట్ పూజా కార్యక్రమం (ముహూర్తం) తో ఈ చిత్రం అధికారికంగా ప్రారంభమైంది.
సమంత ఈ సినిమా ని తన స్వంత బ్యానర్ ‘ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్’ పై నిర్మిస్తుంది అలానే ఈ సినిమాకి సహా నిర్మాతలుగా రాజ్ ఇంకా హిమాంక్ దువ్వూరు ఉండబోతున్నారు. ఈ బ్యానర్‌లో ఇది రెండో చిత్రం కాగా, మొదటి ప్రాజెక్ట్ శుభం మంచి విజయం సాధించింది.
ఈసారి కూడా కాస్టింగ్ చాలా ఆసక్తికరంగా ఉంది. హీరోలుగా దిగంత్, గుల్షన్ దేవయ్య ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, సీనియర్ నటి గౌతమీ, మంజుషా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. కెమెరామెన్‌గా ఒం ప్రకాష్, సంగీత దర్శకుడిగా సంతోష్ నారాయణన్ పనిచేస్తుండగా, కథ – స్క్రీన్‌ప్లేలను సీతా మెనన్, వసంత్ మరింగంటి రాశారు.
‘మా ఇంటి బంగారం’ ఫస్ట్ లుక్ చూస్తేనే ఇది ఒక భావోద్వేగభరిత యాక్షన్ డ్రామా అని అర్థమవుతోంది. సమంతను కొత్త కోణంలో చూపించే ప్రయత్నం ఈ చిత్రంలో కనిపిస్తోంది. షూటింగ్ అధికారికంగా ప్రారంభమైన నేపథ్యంలో, ప్రేక్షకులు ఈ ప్రత్యేక కాంబినేషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.