సమంత రూత్ ప్రభు పెళ్లి ఫోటోలు ఇంకా insta రీల్స్ లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. రెండు రోజుల క్రితమే కోయంబత్తూరులోని ఇషా ఆశ్రమంలో ఈ వేడుక సింపుల్‌గా, ఫామిలీ మెంబెర్స్ మధ్య జరిగింది… ఆ పెళ్లి వైబ్ మాత్రం ఇంకా తగ్గేలా లేదు. తాజాగా విడుదల చేసిన సోలో ఫోటోలు ఈ బజ్కు మరింత హీట్ చేకూర్చాయి. వాటిలో సమంత ఎంతో క్యూట్ గా అందంగా కనిపించింది!

ఈ ఫోటోలలో ఆమె కట్టుకున్న ఎర్రని పట్టు చీర—అంచుల వెంట బంగారు వర్క్ — సూపర్ గా ఉంది. ఆ చీర లో సామ్ నేచురల్‌గా కనిపించింది… అలాగే గోల్డ్ చోకర్, జుమ్కాలు, ఉంగరాలు, గాజులు — ఇలా ఎన్ని నగలు వేసుకున్నా కూడా ఏదీ ఎక్కువగా అనిపించకుండా, అన్నీ ఓ ప్రశాంతమైన గ్రేస్‌లో కలిసిపోయాయి. హెయిర్ స్టైల్ ‘bun’ ఉండడం వల్ల మల్లెపూలు కూడా పర్ఫెక్ట్ గా సరిపోయాయి.

కొంచెం వాలి, పక్కకు చూస్తూ… నెమ్మదిగా నవ్వినట్టే ఉన్న సమంత—ఆ ఫ్రేమ్ లో సూపర్ గా ఉంది!