తెలుగు, మలయాళం, తమిళ్ సినిమాలను హిందీలో రీమేక్ చేయడం సాధారణం అన్న సంగతి తెలిసిందే… అక్కడ ఎన్నో సినిమాలు ఇలాంటి రీమేక్‌లతో భారీ హిట్లుగా మారాయి. అన్ని రీమేక్‌లు విజయవంతం కాకపోయినా, పాపులర్ తెలుగు సినిమాల హిందీ వెర్షన్లపై ఎప్పటికీ మంచి డిమాండ్ ఉంటుంది. తాజాగా ఈ జాబితాలో చేరిన చిత్రం మన వెంకీ మామ ‘సంక్రాంతికి వస్తున్నాం’.
సంక్రాంతి కి రిలీజ్సి అయ్యిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించి, ఇతర భాషల్లో డబ్ కాని తెలుగు సినిమాలలో రికార్డు సృష్టించింది. సుమారు ₹280 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్ సాధించి, సెప్టెంబర్ వరకు ఆ సంవత్సరపు హైెస్ట్-గ్రాస్సింగ్ తెలుగు సినిమా అయింది.
ఇప్పడు ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. పోలీస్ ఆఫీసర్, ex -girlfriend , ఇంకా భార్య… ఈ మూడు పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది… ఇక హిందీ లో ఈ సినిమాకి హీరోగా అక్షయ్ కుమార్ నటించనున్నారు, ఇది ఒరిజినల్‌లో వెంకటేష్ చేసిన పాత్ర.

అనీస్ బజ్మీ ఈ రీమేక్‌కి దర్శకత్వం వహించనున్నారు. ‘వెల్కమ్’, ‘భూల్ భలైయా’ సిరీస్‌లకు పేరుపొందిన బజ్మీ, సల్మాన్ ఖాన్‌తో తెలుగు సినిమా ‘రెడీ’ హిందీ రీమేక్ కూడా దర్శకుడిగా చేసిన వ్యక్తి.
దిల్ రాజు, ఈ తెలుగు చిత్రాన్ని శిరీష్ తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అండర్‌లో నిర్మించారు, ఇప్పుడు ఆయన హిందీ రీమేక్ కూడా నిర్మించనున్నారు. ఇద్దరు మహిళా ప్రధాన పాత్రలతో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక విభాగాల కోసం చర్చలు జరుగుతున్నాయి.
ఆశ్చర్యకరంగా, అనిల్ రవిపూడి నేషనల్ అవార్డు పొందిన సినిమా ‘భగవంత్ కేశరి’ ను కూడా తమిళంలో అతి స్వల్ప మార్పులతో రీమేక్ చేస్తున్నారు. తలపతి విజయ్ ప్రధాన పాత్రలో నటించే ఈ సినిమా ‘జన నాయకన్’ గా తెరకెక్కనుంది. దర్శకుడు హ్. వినోత్.
ఒరిజినల్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ నటించారు. అనిల్ రవిపూడి కథ, దర్శకత్వం వహించారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాణం, ఇంకా భీంస్ సెసిరొలియో సంగీతం అందించారు.