తెలుగు ఫిలిం ఛాంబర్‌ను చిత్ర పరిశ్రమకు సంబంధించి తప్ప, వేరే వాటికి ఉపయోగించకూడదని ‘సేవ్ ఫిలిం ఛాంబర్ బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ’ పేరుతో సోమవారం సినీ ప్రముఖుల కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
ఈ నిరసనకు నటులు మురళీ మోహన్, సురేష్ బాబు, శివాజీ రాజా, జెమినీ కిరణ్, అశోక్ కుమార్, ఏడిద రాజా, బసిరెడ్డి, విజయేందర్ రెడ్డి, నరసింహారావు, శివనాగేశ్వరరావు, చంటి అడ్డాల రవీంద్ర నాథ్ ఠాగూర్, మద్దినేని రమేష్ బాబు, కస్తూరి శ్రీనివాస్, jv మోహన్, హేమ జిల్లోజు తదితరులు హాజరయ్యారు.