కల్కి సినిమా రిలీజ్ ఆయన తరవాత, ఆ టైల్ కథలు చాల వస్తున్నాయి… అంటే ఒక వైపు దయ్యాలు, దేవుడు, ఇంకో వైపు మాయ మర్మం, సైన్స్ ఫిక్షన్ అలా అనమాట… మొన్నే సుధీర్ బాబు జటాధరా సినిమా వచ్చింది. ట్రైలర్, టీజర్ తో హైప్ పెంచినా కానీ, కథ అంతగా మెప్పించలేదు ఆడియన్సు ని. సోనాక్షి సిన్హా నటన సూపర్ గా ఉన్నా కానీ ఎందుకో సినిమా ఆడలేదు.
ఇక ఇప్పుడు ఆది సాయి కుమార్ శంబాలా సినిమా తో మన ముందుకు వస్తున్నాడు… ఇది కూడా కంప్లీట్ సైన్స్ కి దేవుడికి సంబందించిన సినిమానే… ఆల్రెడీ మనం ట్రైలర్ లో చూసాం, ఒక ఊరు వేరే గ్రాహం నుంచి వచ్చి పడిన రాయి వల్ల చాలా బాడ్ ఇన్సిడెంట్స్, చావులను చూస్తుంది… అసలు విషయం ఏంటో తెలుసుకోవడానికి వస్తాడు ఆది, అతను దేవుడిని నమ్మాడు… కానీ మెల్లగా మిస్టరీ రెవీల్ అయ్యే కొద్దీ, సైన్స్ కి అందని పవర్ ఉందని అతనికి అర్ధం అవుతుంది.
అందుకే సినిమా పైన బాగానే బజ్ ఉంది! ఈ సినిమా వచ్చే నెల క్రిస్మస్ సందర్బంగా రిలీజ్ అవుతుంది… కానీ రిలీజ్ కి ఒక నెల ముందే OTT ఇంకా శాటిలైట్ డీల్స్ కంప్లీట్ చేసుకుంది. AHA OTT డీల్ దక్కించుకుంటే, ZEE ఛానల్ శాటిలైట్ డీల్ దక్కించుకుందంట అది కూడా ఆది కెరీర్ లో హైయెస్ట్ అమౌంట్ కి… సో, బజ్ చాల ఉంది ఈ సినిమా పైన!