“బోటనీ పాఠముంది..మ్యాటనీ ఆట ఉంది
దేనికో ఓటు చెప్పరా
హిస్టరీ లెక్చరుంది మిస్టరీ పిక్చరుంది
సోదరా ఏది బె స్టురా
బోటనీ క్లాసంటే బోరు బోరు
హస్టరీ రొస్టు కన్నా రెస్టు మేలు
పాటలు ఫైటులున్న ఫిల్మ్ చూడు
బ్రేకులు డిస్కోలు చూపుతారు
జగడ జగడ జగడ జగడజాం…”
ఈ పాట ఇప్పటికి పాపులర్ కదా… అలాగే Nagarjuna శివ సినిమా కూడా ఆ రోజుల్లో ఒక గేమ్ చెంజర్… ఆ సినిమా విషయం ఈ కాలం పిల్లలకు తెలీదు మరి. ఈ కాలం లో రి-రిలీజ్ ల ట్రెండ్ నడుస్తుండడం తో శివ నిర్మాతలు మళ్ళి ఈ సినిమా ని థియేటర్స్ లో వదలనున్నారు…
తెలుగు సినిమాకి నూతన దిశ చూపిన కల్ట్ క్లాసిక్ శివ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో ఎవరూ నమ్మని సమయంలో నాగార్జున – రామ్ గోపాల్ వర్మ ఇద్దరూ కలసి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్‌ని తెరపైకి తీసుకొచ్చారు. టాలీవుడ్‌లో ఎప్పుడూ చూడని హాలీవుడ్ రేంజ్ సౌండ్ డిజైన్, కెమెరా వర్క్, కొత్త రకం నారేటివ్‌తో చేసిన ఈ సినిమా, కేవలం కల్ట్ హిట్‌గా మాత్రమే కాకుండా ఇండియన్ సినిమాకి కూడా కొత్త దారిని చూపించింది.
‘శివ’ సినిమా తర్వాత నాగ్ ఒక డ్రీమ్ యాక్షన్ హీరోగా మారిపోయాడు. ఆ సినిమా వలన వర్మ కూడా ఒక సెన్సేషన్ డైరెక్టర్‌గా నిలిచాడు.
ఇప్పుడేమో, ఈ కల్ట్ క్లాసిక్‌ను ఇప్పుడు 4K క్వాలిటీకి రీమాస్టర్ చేసి, మోనో ట్రాక్ సౌండ్‌ను డాల్బీ ఆట్మాస్‌కి మార్చారు. పర్ఫెక్షన్ కి ప్రాధాన్యం ఇచ్చే నాగార్జున, అన్ని వర్క్స్ పూర్తయ్యే వరకు రిలీజ్ డేట్‌ని రివీల్ చేయలేదు.
చివరికి, ఏఎన్నార్ 101వ జయంతి సందర్భంగా నాగ్ ఈ గుడ్ న్యూస్ ఇచ్చారు. నవంబర్ 14న శివ 4K డాల్బీ ఆట్మాస్ వెర్షన్ థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగ్ మాట్లాడుతూ – “నా నాన్నగారు సినిమాకి జనరేషన్‌లను దాటే శక్తి ఉందని ఎప్పుడూ నమ్మేవారు. శివ అలాంటి సినిమా. దాన్ని 4K డాల్బీ ఆట్మాస్‌లో రీ-రిలీజ్ చేయడం ఆయన కలలకు ఇచ్చే నా ట్రిబ్యూట్” అన్నారు.
ఇది అక్కినేని అభిమానులకు పెద్ద న్యూస్…