Native Async

సిద్ధూ జొన్నలగడ్డ ట్విట్టర్ లో మళ్ళి యాక్టీవ్ అయ్యాడోచ్…

Siddhu Jonnalagadda Is Back To Twitter
Spread the love

టాలీవుడ్‌లో యూత్ ఆడియెన్స్‌కి ప్రత్యేకంగా దగ్గరైన హీరోల్లో ముందుంటాడు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ. తెరపై తన అల్లరి, స్టైల్, చమత్కారమైన డైలాగ్ డెలివరీతో అభిమానులను మంత్ర ముగ్ధుల్ని చేసే సిద్ధు… ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో తన పర్సనల్ టచ్‌తో హంగామా మొదలుపెట్టాడు.

అసలు సోషల్ మీడియాలో ఎప్పుడూ అంతగా కనిపించని సిద్ధూ, ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తాడు. కానీ ఇప్పుడు మాత్రం అతడు X లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఒకప్పుడు అకౌంట్ డీయాక్టివేట్ చేసిన సిద్ధు, ఇప్పుడు మళ్లీ రీ యాక్టివ్ చేయడం అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపింది. ఇది ఆయన తన అభిమానులతో మరింత దగ్గరగా ఉండాలనే సంకేతం అని ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. తన ఫస్ట్ పోస్ట్ మాత్రం తెలుసు కదా సినిమా టీజర్ పోస్ట్ చేసాడు…

ఇక సినిమాల విషయానికి వస్తే, ఇది అతని కెరీర్‌లోనే క్రూషియల్ టైమ్. సిద్ధు నటించిన తెలుసు కదా సినిమా ఈ అక్టోబర్ 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. స్టైలిష్ designer గా పేరు తెచ్చుకున్న నీరజా కోనా ఈ సినిమాతో డైరెక్షన్ డెబ్యూ ఇస్తుండటం మరో హైలైట్. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తుండగా, ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్ – కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు.

ఒక వైపు సోషల్ మీడియాలో అభిమానులతో దగ్గర కావాలనుకుంటున్న సిద్ధు… మరో వైపు తెలుసు కదా తో మరో హిట్ కోసం రెడీ అవుతున్నాడు. మొత్తానికి ఈ స్టార్ బాయ్ రీ-ఎంట్రీ ఫ్యాన్స్‌కి డబుల్ ఫెస్టివల్ ఫీలింగ్ ఇస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *