ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్బంగా DJ టిల్లు ఫేమ్ సిద్ధూ జొన్నలగ్గడ తన కొత్త సినిమా డీటెయిల్స్ అనౌన్స్ చేసాడు… మన యంగ్ ఈ సారి యువ దర్శకుడు స్వరూప్ RSJతో ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లో కలిసి పనిచేయబోతున్నాడు.
దర్శకుడు స్వరూప్ RSJ తన ఫస్ట్ సినిమా Agent Sai Srinivasa Athreyaతోనే సంచలన విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత తెరకెక్కించిన Mishan Impossible కూడా ప్రయోగాత్మక కథ కావడం తో, ఆయనకు భిన్నమైన సినిమాలు చేసే దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది.
ఇప్పుడు ఆయన తాజా కథను విన్న సిద్దు జొన్నలగడ్డ, దాని ఒరిజినాలిటీకి ఇంప్రెస్ అయి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌లో యాక్షన్‌తో పాటు పక్కా ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉంటుందని తెలుస్తోంది.
ఈ సినిమాలో సిద్దు తన ట్రేడ్‌మార్క్ స్క్రీన్ ప్రెజెన్స్‌ను చూపించడమే కాకుండా, కొత్త తరహా నటనతో మరో డైమెన్షన్‌ను ప్రదర్శించే అవకాశం ఉంటుందని అంటున్నారు. స్క్రిప్ట్‌లో ఉన్న కొత్తదనం, ట్రీట్మెంట్ కారణంగా సిద్దు ఎలాంటి ఆలస్యం లేకుండా ఓకే చెప్పారట.
ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ ప్రొడ్యూస్ చేస్తున్నారు.