మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో South Indian International Movie Awards (SIIMA 2025) కి ప్రత్యేక స్థానం ఉంది… ప్రతి ఏడాది అందరు సినీ నటులు ఎంతో అట్టహాసంగా ఈ అవార్డ్స్ పండగ ని జరుపుకుంటారు… అలానే ఈ ఏడాది కూడా దుబాయ్ లో ఈ వేడుక నిన్న రాత్రి జరిగింది…
2025 లో రిలీజ్ ఐన సినిమాల్లో బెస్ట్ వి సెలెక్ట్ చేసి, ఆ సినిమాల్లో అద్భుతమైన ప్రతిభ కనబరచిన వారికీ అవార్డ్స్ కి ప్రకటించారు… ఈ 1౩ వ SIIMA అవార్డ్స్ లో కల్కి బెస్ట్ సినిమా కాగా, పుష్ప 2 కి ఎక్కువ అవార్డ్స్ వచ్చాయి…
ఇంకెందుకు ఆలస్యం… ఫుల్ అవార్డ్స్ లిస్ట్ చూసేద్దామా:
ఉత్తమ చిత్రం: కల్కి 2898 ఏడీ
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప2)
ఉత్తమ నటి: రష్మిక (పుష్ప2)
ఉత్తమ దర్శకుడు: సుకుమార్ (పుష్ప2)
ఉత్తమ విలన్: కమల్ హాసన్ (కల్కి 2898 ఏడీ)
ఉత్తమ సహాయ నటుడు: అమితాబ్ బచ్చన్ (కల్కి 2898 ఏడీ)
ఉత్తమ సహాయ నటి: అన్నా బెన్ (కల్కి 2898 ఏడీ)
ఉత్తమ హాస్య నటుడు: సత్య (మత్తు వదలరా 2)
ఉత్తమ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ (పుష్ప2)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: రత్నవేలు (దేవర)
ఉత్తమ గీత రచయిత: రామజోగయ్య శాస్త్రి (చుట్టమల్లే)
ఉత్తమ నేపథ్య గాయని: శిల్పారావ్ (చుట్టమల్లే)
ఉత్తమ పరిచయ నటి: భాగ్యశ్రీ బోర్సే (మిస్టర్ బచ్చన్)
ఉత్తమ నూతన నిర్మాత : నిహారిక కొణిదెల (కమిటీ కుర్రోళ్లు)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): తేజ సజ్జా (హనుమాన్)
ఉత్తమ నటి (క్రిటిక్స్): మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్)
ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్): ప్రశాంత్ వర్మ (హనుమాన్)
ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా : అశ్వినీదత్ (వైజయంతీ మూవీస్)
ఉత్తమ దర్శకుడు (కన్నడ): ఉపేంద్ర (యూఐ)
ఉత్తమ నటుడు (కన్నడ): కిచ్చా సుదీప్
ఉత్తమ నటి (కన్నడ) : ఆషిక రంగనాథ్
ఉత్తమ చిత్రం (కన్నడ): కృష్ణం ప్రణయ సఖి
విన్నెర్స్ అందరికి ‘నేటి ప్రపంచం’ CONGRATULATIONS…
SIIMA Awards 2025: ఉత్తమ సినిమా ఎదో తెలుసా???

Spread the love