వెట్రిమారన్ ప్రస్తుతం సింబు తో చేస్తున్న సినిమా పేరు ‘అరసన్’. ఇక ఈ సినిమా తెలుగులో ‘సామ్రాజ్యం’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో సింబు పోషించిన పాత్ర, అతను నడిచే ప్రపంచం గురించి అర్థమయ్యేలా నిర్మాతలు ఐదు నిమిషాల పొడవైన అద్భుతమైన ప్రమో వీడియోను రిలీజ్ చేశారు. యాక్షన్ ఎలివేషన్ తో నిండిన ఆ వీడియో ఫ్యాన్స్ కి ఒక సూపర్ థ్రిల్ ఇచ్చింది.
ఇది ఒక గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా అని చెప్పాలి. ఈ సినిమా, వెట్రిమారన్ తీసిన ‘వడచెన్నై’ యూనివర్స్ కి ఒక క్రాస్ ఓవర్‌గా ఉండబోతోంది. అంటే రాబోయే రోజుల్లో ధనుష్, సింబు ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో కనిపించే అవకాశం ఉంది అన్నమాట.
ఇక తాజాగా వచ్చిన ఈ ప్రమోలో సింబు తన కథని, నెల్సన్ దిలీప్ కుమార్ కి కోర్ట్ ప్రాంగణంలో చెప్పే సీన్లు చూపించారు. అదే సమయంలో సింబు మీద 15 ఏళ్ళ క్రితం జరిగిన హత్యల కేసులో విచారణ జరుగుతుంటుంది. జడ్జి ప్రశ్నించగా, “నేను నిర్దోషిని సర్” అని చెబుతాడు సింబు. కానీ, ఫ్లాష్ కట్స్ లో మాత్రం అతడు యువ వయసులో రక్తంతో తడిసి, హింసాత్మక దృశ్యాల్లో కనిపిస్తాడు.
ఈ టీజర్ లో ఉన్న NTR రిఫరెన్స్ తెలుగువారికి ప్రత్యేకంగా నచ్చింది. ఎందుకంటే ప్రమోలో సింబు చెబుతాడు – “నా కథ బయోపిక్ లా తీయాలంటే NTR లాంటి వాడే బాగా నటించగలడు” అని. అదీ కాక, ఈ ప్రమోలో కనిపించిన నెల్సన్ ప్రస్తుతం NTR తో సినిమా చేస్తున్నాడు. అంతేకాదు, వెట్రిమారన్ కూడా త్వరలోనే NTR తో పని చేయాలని ఆసక్తి చూపుతున్నాడు.
ఇంకా విశేషం ఏంటంటే – ఈ సామ్రాజ్యం ప్రమోను స్వయంగా మన యంగ్ టైగర్ NTR లాంచ్ చేశారు. అలా ఈ సినిమా మీద టాలీవుడ్ లో కూడా మంచి హైప్ క్రియేట్ అయ్యింది.