చిన్న తెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ ఆనంద్, ఇప్పటివరకు నాలుగు సినిమాలతో వెండితెరపై తన ముద్ర వేశాడు. ఇప్పుడు ఐదవ సినిమా హై లెస్సో అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కొత్త దర్శకుడు ప్రసన్నకుమార్ కోట దర్శకత్వంలో, వజ్ర వరాహి సినిమాస్ బ్యానర్‌పై శివచెర్రీ, రవికిరణ్ లు నిర్మిస్తున్నారు.
‘హై లెస్సో’ అనే టైటిల్, గ్రామీణ జీవితానికి దగ్గరగా ఉండే ఒక ముద్ర వాక్యం నుండి ప్రేరణ పొందింది. టైటిల్ లోగో కూడా చాలా రస్టిక్ టచ్‌తో రూపొందించబడింది. ఓ నావ ఆకారంలో ఉన్న ఈ డిజైన్‌లో “S” అక్షరం కోసం ఒక స్త్రీ కాలి రూపాన్ని వాడటం వినూత్నంగా కనిపించింది.టైటిల్ పోస్టర్ మాత్రం భిన్నంగా, ఒక మైథలాజికల్ అండర్‌టోన్‌తో వచ్చింది. ఒక అలంకారమై కాలి చిహ్నం పచ్చని ఆకుపై ఉండగా, కింద రక్తంతో తడిసిన బలి పదార్థాలు – బియ్యం, కోడి, మేక తలలు కనిపించడం గాఢమైన భావాన్ని కలిగించాయి. హీరో చేతిలో రక్తంతో తడిసిన కత్తి, సినిమాలో ఉండబోయే డివైన్ యాంగర్ ని సూచిస్తోంది.
ఈ రోజు హైదరాబాద్‌లో జరిగిన లాంచ్ కార్యక్రమం చాలా గ్రాండ్‌గా జరిగింది. హీరో నిఖిల్ టైటిల్ లోగోని ఆవిష్కరించగా, బన్నీ వాసు స్క్రిప్ట్‌ను నిర్మాతలకు అందజేశారు. వాసిష్ట, చందూ మొండేటి, మెహర్ రమేష్ కెమెరాను ఆన్ చేయగా, వి.వి.వినాయక్ క్లాప్ ఇచ్చి ముహూర్తపు షాట్‌ను ప్రారంభించారు. ఆ మొదటి షాట్‌ను డైరెక్టర్ ప్రసన్నకుమార్ స్వయంగా డైరెక్ట్ చేశారు.
సినిమాలో శివాజీ, నటాషా సింగ్, నక్ష సరన్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, అక్షర గౌడ, మోట్ట రాజేంద్రన్ లాంటి నటీనటులు కూడా ఈ రూరల్ డ్రామాలో భాగమవుతున్నారు. టెక్నికల్ టీమ్‌లో అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తుండగా, సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.
సుధీర్ కూడా తన కొత్త సినిమా టైటిల్ పోస్టర్ ని ట్విట్టర్ లో షేర్ చేస్తూ, తన ఆనందాన్ని నెటిజన్స్ తో పంచుకున్నాడు…
తెలుగు మాత్రమే కాదు, హై లెస్సో తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కూడా విడుదల కానుంది. మొదటి పోస్టర్, టైటిల్‌లోనే ఇంత రా రియలిస్టిక్ టచ్ చూపించిన ఈ సినిమా, గ్రామీణ నేపథ్యాన్ని మిస్టిక్ యాంగిల్‌తో కలిపి ఒక gripping కథని చూపిస్తుందని క్లారిటీ వచ్చింది.