భారతీయ సినీ పరిశ్రమలో మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ ని షేక్ చేసిన దర్శకులు చాలా అరుదు. ఆ లిస్ట్ లో టాప్ లో ఉన్నది మన ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి 2 ఒక్క రోజులోనే సుమారు రూ.220 కోట్లు, RRR అయితే రూ.223 కోట్లు కలెక్ట్ చేసి, తెలుగు సినిమాకు దేశవ్యాప్తంగా కొత్త బెన్చ్‌మార్క్స్ క్రియేట్ చేసాయి.
అలాగే ప్రశాంత్ నీల్ వరుస హిట్స్‌తో పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. కేజీఎఫ్ 2 మొదటి రోజు రూ.162 కోట్లు, సలార్ సుమారు రూ.175 కోట్లు వసూలు చేసి అతన్ని నేషన్ టాప్ యాక్షన్ డైరెక్టర్స్ లో నిలబెట్టాయి.
లోకేష్ కనగరాజ్ కూడా వరుసగా మంచి ఓపెనింగ్స్ సాధిస్తున్నాడు. లియో రూ.145 కోట్లు, ఖైధీ, యూనివర్స్ లో భాగమైన Coolie రూ.151 కోట్లు ఫస్ట్ డే రాబట్టాయి.

ఇప్పుడు ఈ లెజెండ్స్ సరసన మన యంగ్ డైరెక్టర్ సుజీత్ కూడా చేరుతున్నాడు. అతని సాహో అప్పట్లోనే రూ.130 కోట్లు మొదటి రోజే వసూలు చేసింది. ఇప్పుడు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన They Call Him OG ప్రీ-సేల్స్ లోనే రూ.100 కోట్లు దాటేసింది. అంచనాల ప్రకారం మొదటి రోజే రూ.130–150 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది.
ఇప్పటివరకు వరుసగా ₹100 కోట్ల ఓపెనింగ్ డేస్ ఇచ్చిన దర్శకులు కేవలం నలుగురే. ఇప్పుడు ఆ లిస్ట్‌లో రాజమౌళి, నీల్, లోకేష్ సరసన సుజీత్ కూడా చేరి, ఇండియాలో హాటెస్ట్ డైరెక్టర్‌గా నిలిచాడు. OG సక్సెస్ తో అతని కెరీర్ కి ఇది ఒక పెద్ద మైలురాయిగా మారబోతోంది.
ఈ సినిమలో పవన్ కళ్యాణ్ తో పాటు ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్, అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సంగీతం థమన్ అందించగా, దీవీవీ దానయ్య–కళ్యాణ్ దాసరి నిర్మాణం వహించారు.