పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన OG ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతోంది. సినిమా విడుదలైన మొదటి రోజే అందరి నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. చాలా సినీ ప్రముఖులు, స్టార్ హీరోలు, ఇతర సెలబ్రిటీలు సినిమా చూడగానే తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాజాగా, దర్శకుడు సుజిత్ OG విడుదల సందర్భంలో ప్రభాస్ ఇచ్చిన మన్ననలు గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
OG విడుదలకు ఒక రోజు ముందు, సుజిత్ ప్రభాస్‌ను ఫోన్ చేసి సినిమా గురించి తెలుసుకున్నారు. అప్పట్లో ప్రభాస్ సుజిత్‌కి ఫోన్‌లో “కొడతావ్ రా నువ్వు” అంటూ ధైర్యం ఇచ్చారు. సినిమాపై సుజిత్‌లో ఇప్పటికే కంఫిడెన్స్ ఉండేది, కానీ విడుదల రోజున ప్రభాస్ పంపిన “బంగారం కొట్టేసావ్ రా” అనే సందేశం ఆయనకు నిజమైన హ్యాపీనెస్ ఇంకా బ్లాక్‌బస్టర్ ఫీలింగ్‌నే ఇచ్చింది.
ఇంటర్వ్యూలో సుజిత్ మరో అనుభవాన్ని కూడా పంచుకున్నారు. అది సాహో సినిమా విడుదల సందర్భంగా, ఫస్ట్ డే… సాహో విడుదలైనప్పుడు ఫ్లాప్ టాక్ వస్తోంది అని, సుజిత్ హైదరాబాద్‌లో ఉండలేదని చెప్పారు. ప్రభాస్ సుజిత్‌కి ఫోన్ చేసి ఆందోళన వద్దని, సుజీత్ కు ధైర్యం ఇచ్చారు.
సాధారణంగా ఇతర హీరోలైతే ఫ్లాప్ సమీక్షల తర్వాత దర్శకుడిని తప్పకుండా దూరంగా చూసేవారు. కానీ సుజిత్ ప్రభాస్‌తో సానుకూల ఇంప్రెషన్ క్రియేట్ చేశారు. ఈ సానుకూలత OG వంటి హిట్ సినిమాకు కూడా ఒక బలమైన ఆధారంగా మారింది.