నిన్నే పెళ్లాడతా సినిమా గుర్తుండే ఉంది కదా… ఆ సినిమా లో నాగార్జున టబు జంట సూపర్ అనిపించింది… ఐతే టబు, చాలా కాలం తర్వాత మళ్లీ తెలుగు తెరపైకి రాబోతుంది.
1990లలో ఇంకా 2000 , నాగ్ – టబు కాంబినేషన్ లో వచ్చిన సిసింద్రీ, ఆవిడ మా ఆవిడే, నిన్నే పెళ్లాడతా వంటి సినిమాలు భారీ హిట్స్ అయ్యాయి. ఈ ఇద్దరి మధ్య స్నేహబంధం అందరికీ తెలుసు… ఐతే దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరూ ఓ సినిమాకి జట్టు కట్టబోతున్నారు.
ఈ సినిమా నాగార్జున కెరీర్ లోని 100వ చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాత్కాలికంగా ఈ సినిమాకు #King100 అనే టైటిల్ పెట్టారు. షూటింగ్ కూడా ఇటీవలే ప్రారంభమైంది. మరి టబు ఈ సినిమా లో హీరోయిన్ ఆ కాదా అన్నది, తరవాత తెలుస్తుంది…

ఈ సినిమా తో పాటు టబు మరో భారీ తెలుగు సినిమాని కూడా ఒప్పుకుంది — అదే పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్లమ్‌డాగ్ చిత్రం. ఇందులో విజయ్ సేతుపతి, సంయుక్త మేనన్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, టబు కీలక పాత్రలో కనిపించనుంది. దాదాపు ఇరువై ఏళ్ల తర్వాత టబు ఇలా దక్షిణాదిన బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తుండడం అభిమానుల్లో ఆనందం కలిగిస్తోంది.

King100 సినిమాకి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ (DSP) అందిస్తున్నట్టు టాక్. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి లాటరీ కింగ్ అనే టైటిల్ ఉండొచ్చన్న ప్రచారం కూడా ఉంది. పూర్తి వివరాలు, నటీనటుల వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలో రానుంది.