తేజ సజ్జా మిరాయి బాక్సాఫీస్ వద్ద సునామీలా దూసుకుపోతోంది. రిలీజ్ రోజునే 27.2 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి బలమైన ఆరంభం ఇచ్చిన ఈ సినిమా, రెండో రోజు శనివారం 55.6 కోట్ల వరల్డ్‌వైడ్ గ్రాస్‌తో మరింత పుంజుకుంది. టాలీవుడ్‌లో సాధారణంగా డే–2 కలెక్షన్స్ తగ్గుతాయి. కానీ ఈ సినిమా కి మాత్రం కలెక్షన్స్ ఊహించని రీతిలో పెరగడం, పాజిటివ్ టాక్ బలంగా ఉన్నట్టే నిరూపిస్తోంది.

ప్రొడ్యూసర్లు టికెట్ రేట్లను పెంచకపోవడం కూడా ప్రత్యేకతే. టికెట్ హైక్ లేకుండానే ఇంత వసూళ్లు రావడం షాక్ ఇచ్చింది. రేట్లు పెంచి ఉంటే సంఖ్య మరింత పెద్దగా ఉండేది అనడంలో సందేహం లేదు.
ఇక ఆదివారం మాత్రం ఇప్పటివరకు ఉన్న రన్‌లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించే అవకాశముంది. వీకెండ్ పూర్తయ్యే సరికి అన్ని ప్రధాన ప్రాంతాల్లోనూ బ్రేక్ ఈవెన్ పూర్తి అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే వంద కోట్ల మార్క్ చేరుతుందని అంటున్నారు.

అమెరికాలో మిరాయి సినిమా జోరు మరింత భీకరంగా ఉంది. ఇప్పటివరకు $1.3 మిలియన్ గ్రాస్ కొల్లగొట్టింది. ఒక్క శనివారమే $500K (భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 8 గంటల వరకు) రాబట్టి అక్కడ బ్రేక్ ఈవెన్ దాటేసింది. మరోవైపు హిందీ వెర్షన్ కూడా స్థిరంగా పెరుగుతూ, వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్స్ మంచి హోప్ ఇస్తున్నాయి.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణం, కార్తిక్ గట్టమనేని తెరకెక్కించిన ఇతిహాసం–మోడ్రన్ మేళవింపు కథనం, గోవ్ర హరి ఇచ్చిన ఎనర్జిటిక్ స్కోర్ అన్ని కలిసి సినిమాకి మళ్ళీ మళ్ళీ రిపీట్ వేల్యూ ని తెచ్చాయి.
ముఖ్యంగా వచ్చే వారం వరకు ఎలాంటి పెద్ద సినిమాల పోటీ లేకపోవడంతో ఈ సినిమా వసూళ్లు మరింత బలపడతాయని, భారీ లాభాలు తెచ్చే ప్రాజెక్ట్‌గా నిలుస్తుందని పరిశ్రమలో విశ్వాసం పెరుగుతోంది.