అనుకున్నదే అయ్యింది… కేవలం ఐదు రోజుల్లో తేజ సజ్జ మిరాయి సినిమా 100 కోట్ల మైలురాయి ని దాటేసింది. ఈ సినిమా కి ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడం తో సినిమా కచ్చితంగా పెద్ద బ్లాక్బస్టర్ అవుతుందని అన్నారు అందరు.
సినిమా కలెక్షన్స్ 100 కోట్లు దాటగానే, ఈరోజు మార్నింగ్ నిర్మాతలు తమ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు… మిరై ఒక యోధుడి కథ అని అందరికి తెలిసిందే… అశోకుడు అమరత్వ రహస్యాన్ని దాచిన తొమ్మిది గ్రంధాలని, తొమ్మిది మంది యోధులకి ఇచ్చి కాపాడమంటాడు… అలా ఆ గ్రంధాలూ బ్లాక్ స్వోర్డ్ మంచు మనోజ్ కి దక్కకుండా చేయడమే మిరాయి కథ…
ఐతే సినిమా బాగా పాపులర్ ఐన “VIBE UNDI BABY…” సాంగ్ లేకపోవడం ప్రేక్షకుల్లో నిరాశ కలిగిస్తే, రానా దగ్గుబాటి cameo సూపర్ అనిపించింది. సో, ఇప్పుడు కొత్తగా ఆ సాంగ్ కలిపి థియేటర్స్ లో స్క్రీన్ చేస్తారేమో చూడాలి.