అసలైతే 2025 మంచిగానే స్టార్ట్ అయ్యింది… సంక్రాంతికే ‘సంక్రాంతి కి వస్తున్నాం’ సినిమా బ్లాక్బస్టర్ అయ్యింది… అలానే బాలయ్య ‘DAAKU MAHARAJ’ కూడా మంచిగానే ఆడింది. ఇలా ‘తండేల్’, ‘హిట్ 3’ , ‘భైరవం’, ‘కుబేరా’ ఇలా మంచి సినిమాలు వచ్చాయి… కానీ ఆగష్టు లో అంత మంచి సినిమాలు వచ్చినా ఆడలేదు. ‘WAR 2’ కూడా హిట్ టాక్ తెచ్చుకోలేదు. అందుకే సెప్టెంబర్ అనుకోని అదృష్టం అనుకోవాలి…
ఫస్ట్ మౌళి ‘లిటిల్ హార్ట్స్’ సినిమా అనుకోని హిట్ అయ్యింది… చిన్న సినిమా పెద్ద హిట్ అయ్యింది… ఇంకా ఆడుతూనే ఉంది. అలానే బెల్లంకొండ ‘కిష్కింధపురి’ మంచి HIT అయ్యింది… ఇక తేజ సజ్జ ‘మిరాయి’ కూడా సూపర్ హిట్ బ్లాక్బస్టర్! ఇది కూడా చిన్న బడ్జెట్ తో తీసి 100 కోట్ల కలెక్షన్ దాటేసింది…

ఇప్పుడు పవన్ కళ్యాణ్ OG … సూపర్ గా ఉంది! అంతా సుజీత్ మాయ! ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి సూపర్ ట్రీట్! యాక్షన్, రొమాన్స్ ఇంకా స్టోరీ ఇలా అన్ని బాగా కుదిరాయి!
సో, ఇలా ఈ సెప్టెంబర్ బ్లాక్బస్టర్ మంత్ అనమాట!