పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన OG కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు అన్న సంగతి తెలిసిందే. మొదట ఈ చిత్రానికి సెప్టెంబర్ 25న తెల్లవారుజామున 1 గంటకు ప్రత్యేక బెనిఫిట్ షోలు పెట్టాలని మేకర్స్ ప్లాన్ చేశారు. దీనికోసం టికెట్ ధరను కూడా 1000 రూపాయలుగా (GST సహా) నిర్ణయించారు. అలాగే మొదటి పది రోజులు రెగ్యులర్ షోలకీ టికెట్ రేట్ల పెంపునకు అప్లై చేశారు.
కానీ తెలంగాణలో సమస్య వచ్చింది. అక్కడ 1 AM షోలకు అనుమతి లేకపోవడంతో, సెప్టెంబర్ 24న రాత్రి 9 గంటలకు ప్రీమియర్స్ అనుమతించారు. దీంతో సినిమా యూనిట్ వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కొత్తగా రిక్వెస్ట్ పెట్టింది. రాత్రి 10 గంటలకు ప్రీమియర్స్ పెట్టుకోవచ్ఛా అని అడిగింది.

ఇప్పుడా రిక్వెస్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కొత్తగా జారీ చేసిన GO ప్రకారం, సెప్టెంబర్ 24 రాత్రి 10 గంటలకు ప్రీమియర్స్ అనుమతి లభించింది. దీంతో ఏపీ, తెలంగాణ ఫ్యాన్స్ ఒకేసారి తమ ఫేవరెట్ హీరో సినిమాను చూడబోతున్నారు.
ఈ నిర్ణయం ఫ్యాన్స్‌కి పెద్ద సర్‌ప్రైజ్. ఎందుకంటే తెల్లవారుజామున లేచి వెళ్లాల్సిన ఇబ్బంది లేకుండా, ముందురోజు రాత్రే సినిమా థియేటర్లలో ఎంజాయ్ చేసేయొచ్చు. దీంతో బాక్సాఫీస్ వద్ద OGకి బలమైన స్టార్ట్ ఖాయం అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సుజీత్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో పవన్ కళ్యాణ్ సరసన ఎమ్రాన్ హాష్మి, ప్రియాంకా అర్ల్ మోహన్, అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందించగా, DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి ఈ సినిమాను గ్రాండ్‌గా నిర్మించారు.
మొత్తం మీద, దే కాల్ హిమ్ OG ప్రీమియర్స్ ఇప్పుడు పవర్‌ఫుల్‌గా సెట్ అయ్యాయి. సెప్టెంబర్ 24 రాత్రి 10 గంటలకే థియేటర్లలో మాస్ జాతర మొదలవనుంది.