మన పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు సినిమా కొంచం డిస్సపాయింట్ చేసిన కానీ OG తో అందరిని అలరించాడు. ఈ సినిమా పెద్ద బ్లాక్బస్టర్ అయ్యి సూపర్ గా ఆడింది థియేటర్స్ లో. సుజిత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మంచి గ్యాంగ్స్టర్ డ్రామా ఇంకా మన పవన్ కళ్యాణ్ రొమాన్స్, జపాన్ WASHI O WASHI సాంగ్ ఇంకా చాల చాల హై మూమెంట్స్ ఉన్నాయి ఈ సినిమా లో అందుకే పెద్ద హిట్ అయ్యి, ఫాన్స్ ని ఎంటర్టైన్ చేసింది.
ఇక నెక్స్ట్ హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ లైన్ లో ఉంది… ఈ సినిమా షూటింగ్ కూడా అయిపోయింది కాబట్టి, ప్రమోషన్స్ స్టార్ట్ అయిపోయాయి! లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, ఫస్ట్ సింగల్ ప్రోమో రేపు అంటే 9th డిసెంబర్ సాయంత్రం 6 : 30 కి సోషల్ మీడియా లో రిలీజ్ అవుతుంది!
ఈ న్యూస్ ని సోషల్ మీడియా లో మేకర్స్ షేర్ చేస్తూ, పవన్ కళ్యాణ్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు… ఇంకా ఈ పాత విశాల్ దద్లాని పాడితే, భాస్కర భట్ల లిరిక్స్ రాసారు!
సో, రెడీ గా ఉండండి ఉస్తాద్ ప్రమోషన్స్ తో సోషల్ మీడియా మారు మోగబోతోంది!