ఈ మధ్య చిన్న సినిమాలు పెద్ద చప్పుడు చేస్తున్నాయి కదా… అలాగే లిటిల్ హార్ట్స్, మొన్న వచ్చిన రాజు వెడ్స్ రాంబాయి అలా… ఇక ఇప్పుడు వానర సినిమా అలానే ఇంప్రెస్స్ చేస్తుందేమో! మేము ఈ మాట ఎందుకు అంటున్నామో ఈ టీజర్ చుస్తే మీకే తెలుస్తుంది…
కొత్త హీరో అవినాశ్ తిరువిధుల నటిస్తున్న ‘వనర’ సినిమా… ఫస్ట్ లుక్ ఒక్కటి తోనే అటెన్షన్ మొత్తాన్ని దోచేసింది. ఇప్పుడు సిమ్రన్ చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కూడా రివీల్ అయింది. అది కూడా రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీదుగా… గ్రాండ్ ఈవెంట్‌లో.
టీజర్ స్టార్ట్‌నే మాస్ కా దాస్ విశ్వక సేన్ వాయిస్ ఓవర్‌తో అవుతుంది. “ఒక వనర సేనాపతి… రావణుడితో యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది?” అనే అలరించే కాన్సెప్ట్ తీసుకుని… దాన్ని విజువల్స్‌తో, ఎమోషన్స్‌తో, పవర్‌ఫుల్ స్కోర్‌తో స్క్రీన్ మీద అద్భుతంగా చూపించారు. హీరో పాత్రలో వానర లక్షణాలు, ఎనర్జీ, బాడీ లాంగ్వేజ్ అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. ఒక పొలిటికల్ ర్యాలీలో హీరో బైక్ తీసుకెళ్లే సీన్… స్టోరీకి కిక్ ఇచ్చే పాయింట్.
ఆ బైక్ తిరిగి ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? అతను చేసే హంగామా, కలకలం, క్రేజ్… అదే సినిమా అసలు పాయింట్. అవినాశ్–సిమ్రన్ చౌదరి కెమిస్ట్రీ క్యూట్‌గా, ఫ్రెష్‌గా ఉంది. అవినాశ్ నటనలో యాక్షన్, ఎమోషన్, కామెడీ… మూడుమాటలూ పర్ఫెక్ట్‌గా క్లిక్ అయ్యాయి.
ఈ సోషియో–ఫ్యాంటసీ సినిమాకి మరో ప్రత్యేకత ఏమిటంటే… హీరో అవినాశ్ తిరువిధులే స్వయంగా డైరెక్టర్ కూడా. నందు ఈ సినిమాలో విలన్ కనిపించనున్నాడు. హనుమంతుడి కథలో కీలక భాగం కావడంతో… యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతున్నాయి.
RRR, మహానటి, గౌతమీపుత్ర శాతకర్ణి వంటి సినిమాలతో పేరు తెచ్చుకున్న సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాయగా… వివేక్ సాగర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మరో స్పెషల్ అట్రాక్షన్.