రామోజీ ఫిల్మ్ సిటీలో వరాణాసి టైటిల్ లాంచ్ జరిగిన తర్వాత కూడా… సోషల్ మీడియా ఎక్కడ చూసినా అదే హంగామా. ప్రజలు ఇంకా ఆ వేవ్‌లోనే ఉండగానే, వరాణాసి టీమ్ మరో పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది.
షూటింగ్ చాలా భాగం మిగిలి ఉన్నా… మహేష్ బాబు, పృథ్విరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా ముగ్గురు కలిసి ఇంటర్వ్యూల్లో పాల్గొనడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
రాజమౌళి సినిమాలు సాధారణంగా హైప్ పెంచకుండా, సైలెంట్ ట్రాక్‌లో ఉంటాయి.
కానీ వరాణాసి మాత్రం మొదటినుంచే హైప్‌ని మించి ఇంకో వర్డ్ ఏదైనా ఉంటె అలా ఉంటుంది అనేలా ఉంది…
ఇంటర్వ్యూ లో మహేష్, ప్రియాంక ఇంకా ప్రిథ్వీరాజ్… ముగ్గురూ బ్లాక్ అవుట్ ఫిట్స్ లో కనిపించి, సూపర్ గా ఉన్నారు అనిపించారు… ఇక ప్రియాంక చోప్రా ఆ ఫోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ మంచి నోట్ జతచేసింది.

“ఇద్దరు సూపర్‌స్టార్స్‌తో పని చేయడం, ఇంకా సంవత్సరం ముందుగానే ఇంటర్నేషనల్ మీడియాలో ప్రమోట్ చేయడం ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది” అని చెప్పింది.
చివర్లో ఒక చిన్న సిగ్నేచర్‌లా — “Jai Shri Ram” అంటూ #Varanasi హ్యాష్‌ట్యాగ్ వేసి, అభిమానుల్లో ఇంకా ఎలాంటి సర్ప్రైజులు మిగిలి ఉన్నాయి అన్న ఆసక్తి పెంచింది.
వరాణాసి టీమ్ ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తుందో… కానీ ఒక్కో అడుగూ సినిమాపై హైప్‌ని ఎక్కడికో తీసుకెళ్తోంది అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.