మహావతార్ నరసింహ… ఈ ఆనిమేటెడ్ సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే… అసలు మనం ప్రభాస్ ‘ఆదిపురుష్’ వచ్చినప్పుడే ఈలాంటి vibe expect చేసాం… కానీ మొత్తం VFX చెడగొట్టింది… కానీ మహావతార్ నరసింహ సినిమా మాత్రం VFX తో కూడా సినిమాని ఇంకా మన పురాణాల్ని ఇంత బాగా చూపించచ్చా అన్న మంచి ఫీలింగ్ కలిగించింది… మన చిన్నప్పుడు మన అమ్మమ్మలు నామములు చెప్పిన పురాణం కథలు మనకి అప్పుడు అర్ధం అయ్యేవి… కానీ ఇప్పుడు ఈ జనరేషన్ కిడ్స్ కి ఇలానే సినిమాలు, కథలు చూపిస్తే పర్ఫెక్ట్ గా అర్ధం అవుతాయి… సో, అందుకే మహావతార్ నరసింహ సినిమా ఈ జనరేషన్ పేరెంట్స్ అండ్ కిడ్స్ కి కూడా బాగా నచ్చింది!
అందుకే మహావతార్ నరసింహా విజయం టాలీవుడ్‌లో కొత్త మార్గాన్ని తెరిచింది. మొదట ఒక ప్రయోగంగా మొదలైన ఈ యానిమేషన్ కాన్సెప్ట్, ఇప్పుడు పెద్ద సినిమాల్లో కూడా దర్శకులను కొత్తగా ఆలోచించేలా ప్రోత్సహిస్తోంది.
ఈ క్రమంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తమ నెక్స్ట్ బిగ్ ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. అదే ‘వాయుపుత్ర’ – హనుమంతుడి కథ ఆధారంగా తెరకెక్కుతున్న యానిమేటెడ్ చిత్రం. ఈ సినిమాకు ఇటీవల నాగచైతన్యతో తండేల్ వంటి హిట్ ఇచ్చిన దర్శకుడు చందూ మొండేటి మెగాఫోన్ వహించనున్నారు. వచ్చే ఏడాది దసరా సందర్భంగా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమాలో నిజమైన నటులెవ్వరూ ఉండరు. మొత్తం కథను యానిమేటెడ్ క్యారెక్టర్ల ద్వారానే చెబుతారు. అయితే హనుమంతుడి కథ మనందరికీ బాగా తెలిసినదే కాబట్టి, ఇందులో కొత్తగా ఏ విధమైన భావోద్వేగాలు, పవర్‌ఫుల్ విజువల్స్ చూపిస్తారన్నదే ప్రధాన సవాల్‌గా మారింది.
ప్రొడ్యూసర్స్ ఇప్పుడు యానిమేషన్ సినిమాలను స్మార్ట్ ఆప్షన్‌గా చూస్తున్నారు. ఎందుకంటే ఇవి స్టార్ డ్రైవన్ సినిమాలతో పోలిస్తే తక్కువ బడ్జెట్‌తో తయారవుతాయి. కానీ యానిమేషన్ ఉందని మాత్రమే విజయం ఖాయం కాదు. మహావతార్ నరసింహాలాగా గట్టి కంటెంట్ ఉంటేనే ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చు.
ఫిల్మ్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయం ప్రకారం, ఇది టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం కావచ్చు. ఇకపై యానిమేషన్ కూడా బిగ్ స్క్రీన్ స్టోరీటెల్లింగ్‌లో కీలక పాత్ర పోషించవచ్చు. అయితే లైవ్ యాక్షన్ సినిమాలకు ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే నిజమైన నటులు తెచ్చే భావోద్వేగాలను యానిమేషన్ పూర్తిగా రీప్లేస్ చేయలేదు.
ప్రస్తుతం మాత్రం అందరి చూపు వాయుపుత్ర మీదే ఉంది. ఇది ఇండియన్ యానిమేషన్ సినిమా ప్రపంచానికి కొత్త మైలురాయిగా నిలుస్తుందా? అనేది చూడాలి.