వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ అంటేనే ఆమ్మో ఎన్ని blockbusters… నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలు ఎలా మర్చిపోతాం… నవ్వి నవ్వి సంపేసారు కదా! కానీ ఈ సినిమాలకి త్రివిక్రమ్ కథని అందించారు డైరెక్టర్ కాదు!
కానీ ఇప్పుడు వెంకీ హీరో గా త్రివిక్రమ్ డైరెక్టర్ గా ఒక సినిమా వస్తుంది… అదే ‘ఆదర్శ కుటుంబం హౌస్ నం.47 (AK47)’. ఈరోజే ఈ సినిమా టైటిల్ ఇంకా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి, నెటిజన్స్ ని surprise చేసారు! సో, డైరెక్టర్ గా త్రివిక్రమ్ వెంకీ మామ కి మంచి స్టోరీ నే లాక్ చేసాడు.
టైటిల్ చూస్తే ఫ్యామిలీ ఎంటర్టైనర్కి తోడు కొంచెం థ్రిల్ ఫాక్టర్ కూడా ఉంటుందని కనిపిస్తోంది. వెంకటేష్ అయితే పూర్తిగా క్లాసీ ఫ్యామిలీ మ్యాన్ లుక్‌లో కనిపిస్తూ, expectations పెంచేశారు.
అసలు వెంకటేష్–త్రివిక్రమ్ కాంబినేషన్ కోసం అభిమానులు ఎంతకాలంగా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. త్రివిక్రమ్ అంటే ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు హ్యూమర్ కూడా ఉంటుంది సినిమాల్లో… అదే సమయంలో వెంకటేష్‌కి ఉండే నేచురల్ కామెడీ టైమింగ్, ఈ కాంబో పై అంచనాలు పెంచేసింది!
అలాగే టైటిల్ఈ పోస్టర్ తో పాటు సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసి సమ్మర్ 2026కి రిలీజ్ అని ప్రకటించారు… హారికా & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై S. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు ఒక మంచి ఫీల్ ని అందించబోతోందని టీమ్ చెబుతోంది.