మన కుర్ర హీరో మౌళి లేటెస్ట్ సినిమా లిటిల్ హార్ట్స్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలుసు కదా. లాస్ట్ వీక్ రిలీజ్ అయిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి కలెక్షన్స్ తెచ్చుకుంది… కేవలం రెండున్నర కోట్ల ఖర్చు తో నిర్మించిన ఈ సినిమా దెగ్గర దెగ్గర ముప్పై నుంచి నలభై కోట్ల కలెక్షన్ సాధించింది. ఇది చాలదు యూత్ కి ఈ సినిమా ఎంత మంచిగా నచ్చిందో చెప్పడానికి.
అందుకే చాల మంది పెద్ద హీరోలు నవదీప్, నాని, రవి తేజ, సుమంత్, నాగ చైతన్య ఇంకా అల్లు అర్జున్ కూడా ఈ సినిమా ని టీం ని పొగిడారు. ఇప్పుడు లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ కూడా సినిమా కి మంచి రివ్యూ ఇచ్చి మౌళి ని కూడా పొగిడాడు… అంతేనా మన మౌళి కి రౌడీ వేర్ outfit గిఫ్ట్ ఇచ్చి మరి, ఫోటో షూట్ జరిపించాడు… ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతోంది.

అలాగే మౌళి కూడా ఈ వీడియో షేర్ చేసి అసలు ఎంత ఆనందంగా ఉన్నాడో చూడండి: