విజయ్ దేవరకొండ చేసే ప్రతి సినిమాకూ కాస్టింగ్ అప్‌డేట్స్ అంటే ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. అంతెందుకు పూరి జగన్నాధ్ తో చేసిన ‘లైగర్’ సినిమాలో మైక్ టైసన్ ఉంటాడని రివీల్ చేసిన రోజు… దేశమంతా ఆ సినిమా గురించే మాట్లాడింది. కానీ ఆ హైప్ స్క్రీన్‌పై కనిపించలేదు.
ఇప్పుడేమో, విజయ్ చేస్తున్న కొత్త సినిమాలో కూడా ఒక ఇంటర్నేషనల్ యాక్టర్ పేరు వినిపిస్తుంది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌లో ‘ద మమ్మీ’ సినిమాలో నటించిన ప్రముఖ సౌతాఫ్రికన్ నటుడు ఆర్నాల్డ్ వోస్లో కీలక పాత్రలో కనిపించనున్నాడన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ అప్‌డేట్ బయటికి రావడంతో అభిమానుల్లో మిశ్రమ స్పందనలు కనిపిస్తున్నాయి.
ఒక వైపు — “విజయ్‌తో కలిసి హాలీవుడ్ నటుడు నటిస్తుండటమే గ్రేట్!” అని ఎగ్జైట్ అవుతున్నవారు.
మరోవైపు — “లైగర్ లానే మళ్లీ విదేశీ నటుడి హైప్ మాత్రమే మిగిలిపోతుందేమో?” అనే భయం.

అసలు ఈ భయం రావడానికి కారణం, మైక్ టైసన్ లాంటి ఇంటర్నేషనల్ ఐకాన్ ఉన్న కానీ లైగర్ హిట్ అవ్వలేదు. కాబట్టి ఈసారి ఆర్నాల్డ్ వోస్లో వస్తున్నాడన్న మాట… కొందరికి ఎగ్జైట్మెంట్, మరికొందరికి భయం వేస్తుంది.
అయితే, ఒక విషయం మాత్రం నిజం—ఆర్నాల్డ్ వోస్లో ఒక వెర్సటైల్ నటుడు.
అతని స్క్రీన్ ప్రెజెన్స్, నటన, గంభీరమైన లుక్… అన్నీ కథకు ఎలా ఉపయోగపడతాయో చూడాలి.