అసలు మన 90s కిడ్స్ కి మమ్మీ సినిమా ఎంత నచ్చిందో ప్రత్యేకంగా చెప్పాలా… అసలు మనం చుసిన ఫస్ట్ ఇంగ్లీష్ హారర్ సినిమా అదేనేమో కదా… ప్రత్యేకంగా దాంట్లో విలన్ గురించి చెప్పాలి… ఆమ్మో ఆ పిరమిడ్ లోంచి రావడం ఏంటి, ఆ బయపెట్టటం ఏంటి ఆమ్మో ఇప్పుడు తలుచుకున్న భయం వేస్తుంది కదా…
ఐతే ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే, ఒక్కసారి ఊహించుకోండి, మమ్మీ విలన్ ఆర్నాల్డ్ వోస్లూ యాక్ట్ చేస్తే??? అదే నిజం అవ్వబోతోంది బాబు…
విజయ్ దేవరకొండ హీరోగా, రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అయితే, ఇందులో విజ్‌య్ దేవరకొండకు ప్రతినాయకుడిగా హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ వోస్లూ ఎంట్రీ ఇచ్చారు. అదిరిపోయింది కదా న్యూస్…

ఇప్పటికే ఆయన హైదరాబాద్ లో షూటింగ్ లో పాల్గొంటూ ఉన్నారని సమాచారం. సినిమాలో ఆయన పోషిస్తున్న విలన్ పాత్ర చాలా ప్రత్యేకంగా, కొత్తగా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్, స్టార్ కాస్ట్, టెక్నికల్ వాల్యూస్ వల్ల భారీ అంచనాలు రేపుతోంది.
మొత్తానికి, విజయ్ దేవరకొండకు ఒక అంతర్జాతీయ స్థాయి ప్రతినాయకుడిని తీసుకురావడంతో సినిమా హైప్ మరింత పెరిగింది. ఇప్పుడు ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందో అని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.