ఈ ఏడాది ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సినిమాల్లో వార్ 2 ఒకటి. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ భారీ యాక్షన్ డ్రామా, బాక్సాఫీస్ వద్ద మాత్రం పెద్ద పరాభవాన్ని చవిచూసింది. అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ఈ సినిమా, అంచనాలకు తగ్గట్టుగా ఆకట్టుకోలేకపోయి నిరాశ పరచింది. జూనియర్ NTR బాలీవుడ్ మొదటి సినిమా కాబట్టి, కచ్చితంగా హిట్ అవుతుంది అనుకున్నారు. కానీ సమె రొటీన్ కథ కాబట్టి తగ్గ థియేటర్స్ లో ఆడలేదు. అయితే, థియేటర్లలో ప్లాప్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో మాత్రం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.
అక్టోబర్ 9న వార్ 2 నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ అయింది. తాజా Ormax రిపోర్ట్ ప్రకారం, అక్టోబర్ 6 నుండి 12 వరకు కాలంలో వార్ 2 భారత్‌లో అత్యధికంగా వీక్షించబడిన సినిమా గా నిలిచింది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన కొద్ది రోజుల్లోనే 3.5 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించినట్లు సమాచారం.

ఇక రజనీకాంత్ నటించిన కూలీ హిందీ వెర్షన్ కూడా గత వారం ఓటీటీలో విడుదలైనప్పటికీ, వార్ 2 రికార్డులను అధిగమించలేకపోయింది. గమనించదగ్గ విషయం ఏంటంటే — కూలీ ఇంకా వార్ 2 రెండు సినిమాలు ఆగస్టు 14న థియేటర్లలో ఒకే రోజు విడుదలయ్యాయి.
ఆయన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించగా, అనిల్ కపూర్, అశుతోష్ రాణా, వరుణ్ బదోలా ఇతర కీలక పాత్రల్లో కనిపించారు.