నల్లద్రాక్ష రుచికి కొంచెం పుల్లగా ఉండటం వల్ల చాలామంది దీనిని తినేందుకు వెనుకాడుతుంటారు. కానీ పోషక నిపుణుల మాటల్లో చెప్పాలంటే, రుచి పుల్లగా ఉన్నా ఆరోగ్యానికి ఇది అమృతఫలంలాంటిదే. నల్లద్రాక్షలో శరీరానికి అవసరమైన అనేక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి కణాల నాశనాన్ని తగ్గిస్తాయి.
ఈ పండులో కొలాజెన్ ఉత్పత్తిని పెంచే మూలకాలు ఉండటంతో చర్మం కాంతివంతంగా మారుతుంది. ముడతలు, వృద్ధాప్య చాయలు తగ్గి చర్మం యవ్వనంగా ఉంటుంది. నల్లద్రాక్షలో ఉండే రెస్వెరాట్రాల్ అనే పదార్థం సహజ ఈస్ట్రోజన్‌లా పనిచేసి హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. ముఖ్యంగా మహిళల్లో మోనోపాజ్ సమయంలో వచ్చే సమస్యలను తగ్గించడంలో ఇది ఎంతో ఉపయోగకరం.
కంచి కామాక్షి ఆలయంలో ఢంకా వినాయకుని మహిమ
ఇందులోని పోషకాలు ఎముకలకు బలం చేకూర్చి ఆస్టియోపోరోసిస్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అలాగే రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడంలో కూడా సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. నల్లద్రాక్షలోని ఫైటో కెమికల్స్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
బరువు తగ్గాలని కోరుకునేవారికి ఇది అద్భుతమైన పండు. తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ ఉండటం వల్ల ఆకలిని నియంత్రించి ఆరోగ్యకరమైన బరువు నియంత్రణకు తోడ్పడుతుంది. కాబట్టి రోజువారీ ఆహారంలో నల్లద్రాక్షను చేర్చుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.