Ayodhyaలో శ్రీరామచంద్రుడి విగ్రహ ప్రతిష్టాపన తరువాత బాలరాముడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీరామచంద్రుని సొంత ప్రాంతానికి తరలివస్తున్నారు. నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే, గత నెల అంటే జనవరి 13 నుంచి ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళ జరుగుతున్న నేపథ్యంలో Ayodhyaకు భక్తుల తాకిడి పెరిగింది. ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానాలు ఆచరించిన తరువాత బాలరాముడిని దర్శించుకుంటున్నారు. కాగా, జనవరి 29న మౌని అమావాస్య కావడంతో శ్రీరామ చంద్రుడిని దర్శించుకునేందుకు నేరుగా అయోధ్యకు వస్తున్నవారితో పాటు అటు ప్రయాగ్‌రాజ్ నుంచి కూడా కొన్ని లక్షల సంఖ్యలో Ayodhyaకు చేరుకున్నారు.

దీంతో Ayodhyaలో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. పోలీసులు, స్థానిక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బందోబస్తు సరిపోకపోవడంతో కేంద్రం సహకారంతో బలగాలను రంగంలోకి దించింది. కేంద్ర బలగాల సహకారంతో Ayodhyaనగరంలో పూర్తిస్థాయి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే సుమారు 96 గంటల సమయంలో దాదాపు 65 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. నాలుగు రోజుల వ్యవధిలో 65 లక్షల మందికి దర్శనాలు కలిగించడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ ప్రత్యేక పర్వదినాల్లో స్వామిని దర్శించుకోవడం అంటే సామాన్యులకు అత్యంత కష్టమైన పని.
కానీ, Ayodhyaలో వీఐపీలకు ప్రత్యేకించి మరో మార్గం లేకపోవడం, అసలు వీఐపీ మార్గమే ఉండకూడదని నిర్ణయించడం, దేవుడి ముందు అందరూ సమానమనే భావనను ప్రజల్లో తీసుకురావాలనే ఉద్దేశంతోనే అందరికీ ఒకేలా దర్శనం కల్పిస్తారు. నాలుగో రోజుల్లో 65 లక్షల మందికి దర్శనం అంటే సాలీనా రోజుకు కనీసం 20 లక్షల మందికి పైగా భక్తులు స్వామిని దర్శించుకున్నారు. సాధారణంగా ఒకరోజు 3 లక్షల మంది దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు ఉన్నప్పటికీ ప్రత్యేక క్యూలైన్లు లేకపోవడం చేత పెద్ద సంఖ్యలో భక్తులు అయోధ్యకు వస్తున్నారు. మౌని అమావాస్య కాకుండా వసంత పంచమి, మాఘ పౌర్ణిమి, మహాశివరాత్రి పర్వదినాలు ఉండటంతో రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.