కలలో గణపతి ఇలా కనిపిస్తున్నాడా…మీపంట పండినట్టే

If Lord Ganesha Appears Like This in Your Dream, Success Is Guaranteed

దేవతల్లో ప్రధమ పూజ్యనీయుడిగా గణపతిని పూజిస్తాము. కేతు గ్రహ ప్రభావం నుంచి బటయపడేందుకు గణపతిని ఆరాధించాలని చెబుతారు. ఏ పూజ మొదలు పెట్టిన మొదటి పూజ గణపతికే చేయాలి. గణపతిని నిత్యం ఆరాధించేవారి జీవితాల్లో చాలా మార్పులు కనిపిస్తూ ఉంటాయి. మిగతా వారికంటే ఓ మెట్టు ఎత్తులోనే ఉంటారు. ఇంట్లో ఏ శుభకార్యం జరగాలన్నా, విద్యా, వివాహం, జన్మతారాబలానికి సంబంధించిన సమస్యలు పరిష్కారం కావాలన్నా గణపతిని ఆరాధించాల్సిందే. అయితే, కొంతమందికి కలలో గణపతి ఆరాధన చేసినట్టుగానూ, గణపతి ఆలయాలను సందర్శించినట్టుగాను, విఘ్నేశ్వరుడిని చూసినట్టుగానూ లేదా ఆ లంబోధరుడు మనపక్కనే ఉన్నట్టుగానూ కలలు వస్తుంటాయి. కలలు అనేవి సహజమే. కానీ, కలలో ఇలా వినాయకుడు కనిపిస్తే ఏమౌతుంది అనే సందేహాలు చాలా మందిలోనూ ఉంటాయి. సహజంగానే వినాయకుడు శుభకారకుడు. విఘ్నాలను తొలగించేవాడు. విఘ్నాధిపతిగా ఆయనకు పేరుంది. అటువంటి వినాయకుడు కలలో కనిపిస్తే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

గణపతి కలలో కనిపిస్తే జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని అర్ధం చేసుకోవాలని అంటున్నారు జ్యోతిష్య పండితులు. జీవితంలో ఎదురయ్యే అన్ని రకాలైన అవరోధాలు తొలగిపోయే సమయంలో ఇలా గణపతి కలలో దర్శనం ఇస్తుంటారని అంటారు. కష్టమైన పనులు చేపట్టినపుడు గణపతి కలలో కనిపిస్తే ఆ కష్టం ఇష్టంగా మారి పనిని సులువుగా పూర్తి చేసే మార్గాలు కనిపించేలా చేస్తారని భావించాలి. సాహస కార్యాలు మొదలుపెట్టినపుడు కూడా గణపతి కలలో కనిపిస్తే ఆ పని విజయవంతంగా పూర్తవుతుంది. విద్యార్ధుల కలలో పుస్తకంతో గణపతి కనిపిస్తే పరీక్షల్లో విజయం సాధిస్తారని అర్ధం చేసుకోవాలి. సిద్ధి బుద్ధి సమేత గణపతి కలలో కనిపిస్తే వివాహం జరుగుతుందని, వైవాహిక బంధం బలంగా ఉంటుందని అర్ధం. మొదక గణపతి కలలో కనిపిస్తే జీవితంలో ఆహారానికి లోటు ఉండదని అర్ధం. కలశం పట్టుకున్న గణపతి కలలో కనిపిస్తే త్వరలోనే నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారని అర్ధం. మూషికవాహనుడిగా కలలో కనిపిస్తే మోక్షం వస్తుందని అర్ధం. చెరుకు గడలతో గణపతి కనిపిస్తే జీవితం తీయగా మారబోతుందని అర్ధం. అదే గణపతి ఆగ్రహంతో ఉన్నట్టుగా కల వస్తే జీవితంలో అవరోధాలు రాబోతున్నాయని, వాటిని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలని సూచిస్తుంది. ఇష్టదైవాన్ని పూజిస్తున్నప్పటికీ ప్రతిరోజూ తప్పకుండా గణపతిని అష్టోత్తరంతో పూజించాలని, ఆ తరువాతే ఇష్టదైవారాధన చేయాలని పండితులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *