మేష రాశి (Aries)
ఈరోజు: కొత్త పనులు ప్రారంభించాలనే ఉత్సాహం ఉంటుంది. అయితే తొందరపాటు నిర్ణయాలు ఆర్థికంగా ఇబ్బంది కలిగించవచ్చు. వ్యాపారులు భాగస్వామ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు ఏకాగ్రత కొంచం తగ్గవచ్చు. కుటుంబంలో పెద్దవారితో అభిప్రాయ భేదాలు రావచ్చు.
వృషభ రాశి (Taurus)
ఈరోజు: ఆర్థిక విషయాల్లో మెరుగుదల ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయం గడుపుతారు. వృత్తి పరంగా ఉన్నతాధికారుల సహకారం ఉంటుంది. కొత్త ఒప్పందాలు, వ్యాపార నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యపరంగా చిన్న ఇబ్బందులు తప్ప వేరే సమస్య ఉండదు.
మిథున రాశి (Gemini)
ఈరోజు: శ్రమించిన ఫలితం ఆలస్యంగా దక్కుతుంది. వృత్తి పరంగా కొంత ఒత్తిడి ఉంటుంది. వ్యాపారంలో లాభాల కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో అప్రయత్నంగా వాగ్వాదం రావచ్చు. విద్యార్థులు శ్రద్ధ పెట్టితే మంచి ఫలితాలు వస్తాయి. ప్రయాణాలు ఉంటే ఆలస్యం కావచ్చు.
కర్కాటక రాశి (Cancer)
ఈరోజు: మిత్రుల సహకారం లభిస్తుంది. వ్యాపారంలో అనూహ్య లాభాలు కలుగుతాయి. కొత్త ఆలోచనలు అమల్లోకి వస్తాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్యపరంగా ఊహించని సౌకర్యం కలుగుతుంది.
సింహ రాశి (Leo)
ఈరోజు: ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. కానీ కోపం అదుపులో లేకపోతే సంబంధాలు దెబ్బతింటాయి. ఉద్యోగంలో ఉన్నవారు తమ ప్రతిభను చూపగలుగుతారు. వ్యాపారాల్లో మిత వ్యయం అవసరం. కుటుంబంలో పెద్దల సలహా ఉపయోగపడుతుంది. విద్యార్థులు కొత్త విషయాల్లో రాణిస్తారు.
న్యా రాశి (Virgo)
ఈరోజు: ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. వృత్తి పరంగా అడ్డంకులు ఎదురైనా చివరికి అనుకూలంగా మారతాయి. వ్యాపారంలో భాగస్వాములతో తగాదాలు రావచ్చు. కుటుంబంలో అనుకోని సమస్య తలెత్తవచ్చు. విద్యార్థులు శ్రమతో ముందుకు సాగాలి.
తులా రాశి (Libra)
ఈరోజు: ఆర్థిక లాభాలు దక్కుతాయి. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో అనుకున్నదానికంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులు సృజనాత్మకంగా ఉంటారు.
వృశ్చిక రాశి (Scorpio)
ఈరోజు: చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆలస్యం కలుగుతుంది. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో అనుకోని పనులు ఇబ్బంది కలిగిస్తాయి. కుటుంబంలో పెద్దలతో చర్చలు సాంత్వన కలిగిస్తాయి. ఆరోగ్యపరంగా అలసట అనిపిస్తుంది.
ధనుస్సు రాశి (Sagittarius)
ఈరోజు: ఉత్సాహం పెరుగుతుంది. ఆర్థిక లాభాలు కలుగుతాయి. కొత్త ప్రణాళికలు ప్రారంభించడానికి అనుకూలం. వ్యాపారంలో సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాల సూచనలు కనిపిస్తాయి. విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి.
మకర రాశి (Capricorn)
ఈరోజు: ఆలోచనలో స్థిరత్వం ఉండదు. వృత్తి విషయాల్లో అడ్డంకులు రావచ్చు. వ్యాపారంలో అనుకున్న ఫలితం రాకపోవచ్చు. కుటుంబంలో అసహనం పెరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులు దృష్టి నిలుపుకోవాలి.
కుంభ రాశి (Aquarius)
ఈరోజు: స్నేహితుల సహకారం లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో అనుకూలత ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నతాధికారుల ప్రశంసలు వస్తాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. విద్యార్థులకు ఉన్నత ఫలితాలు వస్తాయి.
మీన రాశి (Pisces)
ఈరోజు: ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారంలో లాభదాయకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వస్తాయి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక లాభాలు కలుగుతాయి. విద్యార్థులు శ్రద్ధ పెట్టి ముందుకు సాగుతారు.
ఈరోజు మిథున, వృశ్చిక, మకర రాశుల వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. ధనుస్సు, వృషభ, తుల, మీన రాశుల వారికి అత్యంత అనుకూలమైన రోజు.