భారత్ ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డే సీరిస్ మ్యాచ్ ఆదివారం పెర్త్ మైదానంలో ప్రారంభం కాబోతున్నది. ఈ సీరిస్ ఇప్పటికే హైప్ క్రియేట్ అయింది. మొదటిసారిగా గిల్ పూర్తిస్థాయి కెప్టెన్‌గా మొదటి మ్యాచ్ ఆడబోతున్నాడు. ఇందులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు కూడా ఉండటం విశేషం. వీరితో పాటుగా కొత్తగా అభిమన్యు ఈశ్వర్, నితీశ్ కుమార్ రెడ్డీ వంటి నూతన ఆటగాళ్లు కూడా ఈ మ్యాచ్‌లో ఉన్నారు. అనుభవం యంగ్ ఎనర్జీ కలిసిన ఈ అరుదైన కాంబినేషన్ పెర్త్ మైదానంలో ఏవిధంగా ఆడుతుందో అనే ఆసక్తి నెలకొన్నది.
ఈ స్వీట్ కేజీ అక్షరాల లక్షరూపాయలు
మరోవైపు ఆస్ట్రేలియా జట్టు మిచెల్ మార్ష్ నాయత్వంలో బలంగా ఉంది. ట్రావిన్ హెడ్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ వంటి బ్యాట్స్‌మెన్ పవర్ ప్యాక్‌తో జట్టు బలంగా ఉండటంతో పాటు హోమ్ గ్రౌండ్ కావడంతో ఈ జట్టును భారత్ ఎలా ఎదుర్కొంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు, ఈ గ్రౌండ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో ఏ జట్టు ఏ స్థాయిలో పరుగులు సాధిస్తుందో చూడాలి.
ఇక ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు గిల్ మీడియాతో ముచ్చటించాడు. రోహిత్, విరాట్ కోహ్లీ వంటి ఆటగాళ్లతో కలిసి నాయకత్వం బాధ్యతలు చేపట్టడం ఒక గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపారు. వారి నుంచి పలు విషయాలను తెలుసుకొని, నేర్చుకొని వారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పేర్కొన్నాడు. జట్టులోని యువ ఆటగాళ్లకు ఇదొక గోల్డెన్ చాన్స్‌గా ఆయన తెలిపారు. ఈ గోల్డెన్ ఛాన్స్‌ను ఇండియన్ యంగ్‌టీమ్ ఎలా వినియోగించుకుంటుందో చూడాలి.