YOYO టెస్ట్ అంటే మేము ప్రత్యేకంగా చెప్పకర్లేదు అనుకుంట… అదే మన BCCI మన క్రికెటర్స్ ఫిట్ గా ఉన్నారో లేదో తెలుసుకునే టెస్ట్. ఐతే ఇప్పుడు మన ఇండియన్ టీం ఇటు ASIA CUP 2025 తో పాటు వన్ డే సిరీస్ కూడా ఇంగ్లాండ్ ఇంకా ఆస్ట్రేలియా తో ఆడాలి. సో, మరి అందరు ప్లేయర్స్ ఫిట్ గా ఉన్నారో లేదో టెస్ట్ చేయాలి కదా…
ఐతే మన కోహ్లీ ఇంకా రోహిత్ అటు టెస్ట్స్ ఇంకా ఇటు T 20 కి కూడా రిటైర్మెంట్ ఇచ్చేసారు. సో, ఇప్పుడు వాళ్ళు జస్ట్ వన్ డే సిరీస్ ఆడతారు. సో, విరాట్ ఏమో 36 ఇయర్స్, రోహిత్ కూడా 38 ఇయర్స్… మరి ఈ ఏజ్ లో వాళ్ళు ఫిట్ గా ఉంటారో లేదో అని డౌట్…
కానీ లేటెస్ట్ గా కండక్ట్ చేసిన YOYO టెస్ట్ లో కోహ్లీ అందరి కంటే ఇన్ ఫాక్ట్ ఈ టెస్ట్‌లో అద్భుతమైన 21.6 స్కోరు నమోదు చేశాడని వార్తలు వచ్చాయి. భారత క్రికెటర్ల కోసం సాధారణంగా 16.1–17 మధ్యే బెంచ్‌మార్క్ ఉండగా, దాన్ని దాటేసి ఇంత భారీ స్కోరు చేయడం నిజంగా విస్మయమే.
గతంలో కోహ్లీ బెస్ట్ స్కోరు 19 అని రికార్డుల్లో ఉంది, అలాంటిది ఇప్పుడు 21.6కి వెళ్లాడని చెప్పడం ఆయన క్రమశిక్షణ, కఠిన శిక్షణ, శరీరంపై తీసుకున్న శ్రద్ధకు నిదర్శనం. అయితే బీసీసీఐ లేదా కోహ్లీ నుంచి అధికారికంగా స్కోరు ధృవీకరణ రాకపోయినా, మీడియా రిపోర్టులు, సోషల్ మీడియాలో ఉన్న హైప్ మాత్రం ఈ వార్తను దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మార్చేశాయి.
YOYO టెస్ట్ కింగ్ మన కోహ్లీ…

Spread the love