ఒక సంవత్సరం క్రితం అల్లు అర్జున్ పుష్ప 2 విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో జరిగిన భయానకమైన స్టాంపీడ్ ప్రమాదం ఎవ్వరూ మరచిపోలేరు. ఆ దుర్ఘటనలో రేవతి అనే మహిళ దురదృష్టవశాత్తు మరణించగా, ఆమె కుమారుడు శ్రీ తేజ తీవ్రంగా గాయపడి ఇప్పటికీ చికిత్స తీసుకుంటూనే ఉన్నాడు.
ఈ ఉదయం సోషల్ మీడియా ఇంకా కొన్ని వెబ్ పోర్టల్స్‌లో “శ్రీ తేజ చికిత్స ఖర్చులు భరించలేక తండ్రి భాస్కర్ ఇబ్బందులు పడుతున్నాడు… అల్లు అర్జున్ సహాయం చేయలేదు” అనే పూర్తిగా అబద్ధమైన వార్తలు విపరీతంగా వైరల్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌కు అత్యంత సన్నిహితుడు అయిన నిర్మాత బన్నీ వాస్ ముందుకు వచ్చి… అల్లు అర్జున్ కుటుంబానికి పూర్తి సహాయం చేస్తూనే ఉన్నారని స్పష్టం చేశారు.
అయితే ఇప్పుడు, తెలంగాణ ప్రభుత్వం మధ్యవర్తిగా నియమించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్వయంగా భాస్కర్‌ను కలిసి పరిస్థితి ఏంటో తెలుసుకున్నారు. ఆయన వెల్లడించిన విషయాలు ఈ రూమర్లకు పూర్తిగా చెక్ పెట్టాయి.

దిల్ రాజు చెప్పినదేమిటంటే—
⭐ అల్లు అర్జున్ ప్రమాదం జరిగిన వెంటనే ₹2 కోట్లు శ్రీ తేజ పేరుతో ఫిక్స్‌డ్ డిపాజిట్‌గా పెట్టించాడు.
⭐ అలాగే ఇప్పటి వరకూ వచ్చిన ₹70 లక్షల మెడికల్ ఖర్చులన్నింటినీ కూడా అల్లు అర్జున్ భరించాడు.
⭐ ఆ ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై వచ్చే వడ్డీతోనే కుటుంబ ఖర్చులు, బాలుడి చికిత్స కొనసాగుతోంది.
శ్రీ తేజ తండ్రి భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ—
“నా బిడ్డ త్వరగా కోలుకోవాలంటే కొంతకాలం మరింత రిహాబిలిటేషన్ అవసరం అవుతోంది. అందుకే అదనపు సహాయం కోరాను. దిల్ రాజు గారిచే అల్లు అర్జున్, అల్లు అరవింద్ గారికి తెలియజేశాను” అని చెప్పారు.
దీనిపై దిల్ రాజు స్పష్టత —
👉 శ్రీ తేజ పూర్తిగా కోలుకునే వరకు… 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు… ఎంత అవసరమైతే అంత సహాయం అందిస్తామని అల్లు అర్జున్ ఇప్పటికే అంగీకరించాడు అన్నారు.
ఈ వివరణతో సోషల్ మీడియాలో వ్యాపించిన రూమర్లన్నీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి.