Native Async

వచ్చే ఏడాది సెలవుల లిస్ట్‌ ఇదే

Andhra Pradesh 2026 Government Holidays List Public and Optional Holidays Calendar
Spread the love

వచ్చే 2026 సంవత్సరానికి సంబంధించిన అధికారిక ప్రభుత్వ సెలవుల జాబితాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. కొత్త సంవత్సరం మొదలవ్వకముందే హాలీడే ప్లానింగ్ కోసం ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు, ఐటీ ప్రొఫెషనల్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఎందుకంటే ఈ సెలవులను ఆధారంగా చేసుకుని కుటుంబంతో టూర్లు, యాత్రలు, ప్రత్యేక కార్యక్రమాలు ప్లాన్ చేసుకోవచ్చు. అందుకే ప్రభుత్వం ముందుగానే స్పష్టమైన హాలిడే క్యాలెండర్‌ను ప్రకటించింది.

2026లో మొత్తం 24 సాధారణ ప్రభుత్వ సెలవులు, 21 ఐచ్ఛిక సెలవులు ఉన్నాయి. ఇవి ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రైవేట్ సంస్థలకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకునేందుకు ఎంతో ఉపయోగపడతాయని ప్రభుత్వం తెలిపింది. ముఖ్యంగా పండుగలు, జాతీయ దినోత్సవాలు, మతపరమైన వేడుకలకు అనుగుణంగా ఈ తేదీలను ఖరారు చేశారు.

  1. భోగి -జనవరి 14
  2. మకర సంక్రాంతి – జనవరి 15
  3. కనుమ – జనవరి 16
  4. రిపబ్లిక్‌ డే- జనవరి 26
  5. మహా శివరాత్రి – ఫిబ్రవరి 15
  6. హోలీ – మార్చి 3
  7. ఉగాది – మార్చి 19
  8. రంజాన్‌ – మార్చి 20
  9. శ్రీరామ నవమి – మార్చి 27
  10. గుడ్‌ ఫ్రైడే – ఏప్రిల్ 3
  11. బాబు జగ్జీవన్‌రావ్‌ జయంతి – ఏప్రిల్ 5
  12. బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి – ఏప్రిల్ 14
  13. బక్రీద్ – మే 27
  14. మొహర్రం – జూన్ 25
  15. ఇండిపెండెన్స్‌ డే – ఆగస్టు 15
  16. వరలక్ష్మి వ్రతం – ఆగస్టు 21
  17. మిలాద్ ఉన్ నబీ – ఆగస్టు 25
  18. శ్రీకృష్ణాష్టమి – సెప్టెంబర్ 4
  19. వినాయక చవితి – సెప్టెంబర్‌ 14
  20. గాంధీ జయంతి – అక్టోబర్‌ 2
  21. దుర్గాష్టమి – అక్టోబర్‌ 18
  22. విజయ దశమి – అక్టోబర్‌ 20
  23. దీపావళి – నవంబర్‌ 8
  24. క్రిస్మస్‌ – డిసెంబర్‌ 25

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit