అవును ఇది నిజం. ఎన్నో ఎదురు దెబ్బలను తిని, ఓటములను ఎదుర్కొని తిరిగి నిలబడి భారీ విజయాలు సాధించడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ రాజకీయాల్లో చాలా కష్టం. ప్రజల్లో ఎంత పరపతి ఉన్నా…ఎన్నికల సమయానికి సామాజిక అంశాలు, డబ్బు పనిచేస్తుంది. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వీటన్నింటిని దాటుకొని 2024 ఎన్నికల్లో పోటీ చేసిన 21 స్థానాల్లో విజయం సాధించి 100శాతం స్ట్రైక్ రేట్‌ను సాధించింది.
వేగం, శక్తి, సామర్థ్యం కలయికే టీయు 160 ఎం
ఇదిలా ఉంటే ఇప్పుడు బీహార్‌లోనూ అటువంటి సంఘటనే చోటు చేసుకోబోతున్నది. తండ్రి మరణం తరువాత పార్టీలోకి వచ్చిన చిరాగ్ పాశ్వాన్‌ను 2020 ఎన్నికల్లో ఓటర్లు పట్టించుకోలేదు. కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్నారు. అయితే, చిరాగ్ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, సొంతింటి నుంచి వచ్చిన ఇబ్బందులను ఎదుర్కొని, బాబాయ్‌ని ఎదిరించి సొంత పార్టీని స్థాపించి, 2024 ఎన్నికల్లో ఎన్డీయే కూటమితో కలిసి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 5 ఎంపీ స్థానాల్లో పోటీ చేసి 100శాతం స్ట్రైక్‌రేట్ సాధించాడు.
ప్రస్తుతం కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న చిరాగ్ పాశ్వాన్, 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి తరపున 29 స్థానాలు దక్కించుకొని పోటీ చేశారు. ఇందులో ఎల్జేపీ (రాంవిలాస్) పార్టీ 22 స్థానాల్లో ముందంజలో ఉంది. ఈ 22 చోట్ల గెలుపు ఖాయంగా కనిపిస్తుండటంతో ఆయన పార్టీ 75 శాతం స్ట్రైక్ రేట్ సాధించినట్టుగా తెలుస్తోంది. ఒక్క స్థానం నుంచి ఇప్పుడు 22 స్థానాలు గెలుచుకోవడంతో ఆయన్ను అందరూ బీహార్ పవన్ కళ్యాణ్‌గా పిలుస్తున్నారు. మోదీకి అనుంగ భక్తుడిగా చెప్పుకునే చిరాగ్ పాశ్వాన్ 2029 ఎన్నికల్లో మోదీని మరోసారి ప్రధానిని చేయాలన్నదే లక్ష్యమని చెప్పుకొచ్చారు.