డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అల్లవరం మండలం, ఓడలరేవులో మొంథా తుఫాను బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి వెళ్లి బాధితుల క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్న సీఎం.

అలాగే నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం నుండి నిత్యావసర సరుకులు, 25 కేజీల బియ్యం, ఒక్కో కుటుంబానికి రూ.3 వేల చొప్పున సాయం అందినట్టు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అరగట్లపాలెం, బెండమూరులంక గ్రామాలకు వెళ్లి రైతులతో మాట్లాడారు. నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి, వీలైనంత త్వరగా పంట నష్టాన్ని అంచనా వేసి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

అలాగే, మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ ద్వారా ఏరియల్ విజిట్ చేశారు. బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో, చిలకలూరిపేట, పర్చూరు, చీరాల, కోడూరు, నాగాయలంక మీదుగా ఓడలరేవు వరకు ఆయన ఆకాశ మార్గంలో పర్యటించిన అనంతరం కోనసీమ జిల్లా, అల్లవరం మండలం ఓడలరేవులో దిగి ప్రజలతో నేరుగా కలిశారు. ఓడలరేవు నుంచి రోడ్డు మార్గాన ప్రయాణించి నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు.