ఏ దేశంలో అయితే భారీగా ఆయిల్, గ్యాస్ నిక్షేపాలు ఉంటే ఆ దేశం ఆర్థికంగా ముందంజలో ఉంటుంది. ఇవే నిక్షేపాలు అభివృద్ధి చెందిన లేదా చెందుతున్న దేశాల్లో ఉంటే ఆ దేశానికి అదనపు బలం చేకూరినట్టు అవుతుంది. తాజాగా భారత్‌కు చెందిన అండమాన్ నికోబార్ దీవుల్లో పెద్ల మొత్తంలో నేచురల్ గ్యాస్ నిక్షేపాలు బయటపడ్డాయి. ఈ నిక్షేపాల్లో 87 శాతం మేర మీథేన్ ఉన్నట్టుగా గుర్తించారు.
గుర్తించిన ప్రాంతాల్లో భారత శాస్త్రవేత్తలు పెద్ద ఎత్తున పరిశోధనలు చేస్తున్నారు. పూర్తిస్థాయిలో ఈ నిక్షేపాల వెలికితీత మొదలైతే నేచురల్ గ్యాస్ విషయంలో భారత్‌కు పెద్ద ఊరట అనే చెప్పాలి. మీథేన్ వాయువును శుద్ధి చేసే క్రమంలో వెలువడే వివిధ రకాలైన గ్యాస్‌లను కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. భారత్ అవసరాలకు ఈ గ్యాస్ నిక్షేపాలు ఎంతగానో ఉపయోగపడతాయి అనడంలో సందేహం లేదు.