విశాఖ ప్రజలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇప్పటికే అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నది. ఎన్నో మాల్స్ అక్కడ నెలకొల్పారు. తాజాగా మరో మాల్ కన్‌స్ట్రక్ట్ అవుతున్నది. ఇనార్బిట్ మాల్‌కు సంబంధించిన నిర్మాణం దాదాపు చివరి దశకు చేరుకున్నది. ఈ మాల్‌కు సంబంధించిన డ్రోన్ దృశ్యాలు సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యాయి. అయితే, ఈ మాల్ నిర్మాణం ప్రారంభం వైఎస్ జగన్ అధికారంలో ఉండగా ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చి విశాఖను పాలనా రాజధానిగా తీర్చిదిద్దాలని అనుకున్నారు.
ఇందులో భాగంగానే మాల్స్ ఏర్పాటు కూడా ఆయన గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చారు. అయితే, ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానుల మాటను పక్కన పెట్టి అమరావతిని డెవలప్ చేస్తున్నారు. ప్రపంచ రాజధానులతో సమానంగా పోటీ పడుతుందని అంటున్నారు. మరి ఈ టర్మ్‌లో అయినా రాజధాని నిర్మాణం పూర్తవుతుందా ఏమో చూడాలి.