తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్య క్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారి ఆలయంలో అభివృద్ధి పనుల నిమిత్తం తిరుమల తిరుపతి దేవస్థానం రూ.35.19 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల సౌకర్యార్థం దీక్ష విరమణ మంటపం, 96 గదులతో భారీ సత్రం నిర్మాణం చేపట్టనున్నారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం అనంతరం పవన్ కళ్యాణ్ వారి ఇంటి ఇలవేల్పు ఆంజనేయ స్వామికి మొక్కులు చెల్లించుకొనేందుకు కొండగట్టు క్షేత్రానికి వెళ్లినప్పుడు అక్కడి మౌలిక సదుపాయాల కల్పనపై విజ్ఞప్తులు వచ్చాయి. అందుకు అనుగుణంగా చేసిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి నిధులు మంజూరు చేసారు టీటీడీ ఛైర్మన్ శ్రీ బొల్లినేని, పాలక మండలి సభ్యులు, టీటీడీ ఈ.వో, అడిషనల్ ఈ.వో. ఈ ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలిపారు డిప్యూటీ CM పవన్ కళ్యాణ్.