దీపావళి వస్తుంది అంటే నాలుగైదు రోజులపాటు ఎక్కడ చూసినా టపాసుల మోతలే కనిపిస్తాయి. ఇంటి బయట పేల్చిన టపాసుల చెత్త…ఇంటి లోపల టపాసుల బాక్సులు ఉండటం సహజం. దీపావళి రోజు తరువాత మనంతా ఇంటిని క్లీన్ చేసుకుంటాం. ఇది అందరూ చేసేదే. అయితే, మీర్జాపూర్‌కు చెందిన ఓ యువతికి తన తల్లి ఇళ్లు క్లీన్ చేయమని, టపాసులకు సంబంధించిన చెత్తను బయటపడేయాలని చెప్పింది.
నయారికార్డ్ః బంగారం లక్షకోట్లు కొనుగోలు
ఇలాంటి విషయాలు తల్లిదండ్రులు చెప్పకముందే ఇంటిని క్లీన్ చేసేసుకుంటాం. కానీ, తల్లి తనకు ఆ పనులు చెప్పిందని, తన సోదరుడికి చెప్పకుండా తనకే చెప్పడంతో కలత చెంది మీర్జాపూర్‌లోని సెల్‌టవర్ ఎక్కేసింది. తన తల్లి చెప్పిన మాటలకు తాను మనస్థాపం చెందానని, తన సోదరుడికి చెప్పకుండా తనకే ఎందుకు చెప్పిందని టవర్ ఎక్కి ప్రశ్నించింది. యువతి టవర్ ఎక్కడంతో హుటాహుటిన పోలీసులు ఆ స్థలానికి చేరుకొని టవర్ ఎక్కిన యువతని బుజ్జగించి కిందకు దించారు. అనంతరం ఆ యువతిని కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించేశారు. దీనికి సంబంధించిన వీడియో, సమాచారం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.