Native Async

కళ్లు జిగేల్‌మనిపిస్తున్న నవీ ముంబై ఎయిర్‌పోర్ట్‌

Stunning Navi Mumbai Airport Nears Completion
Spread the love

ముంబైలోని చత్రపతి శివాజీ మహారాజ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ దేశంలో బిజీయస్ట్‌ ఎయిర్‌పోర్టుల్లో ఒకటి. ఇక్కడ నిత్యం రద్దీ అధికంగా ఉండటంతో నవీ ముంబై ప్రాంతంలో మరో ఎయిర్‌పోర్ట్‌ను సిద్దం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఆధునీకతకు పెద్దపీఠ వేస్తూనే సర్వాంగ సుందరంగా, అద్భుతమైన కళాకృతులతో, ఎటు చూసినా కళ్లు జిగేల్‌మనిపించే సుందరాకృతులతో వావ్‌ అనిపించేలా రెడీ చేస్తున్నది. ఇప్పటికే చాలా వరకు నిర్మాణం పూర్తిచేసుకున్నది. ఫైనల్‌గా మెరుగులు దిద్దుతున్నారు. మరికొన్ని రోజుల్లోనే అందుబాటులోకి రాబోతున్న ఈ ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించిన కొన్ని క్లిప్పింగ్స్‌ బయటకు వచ్చాయి. అవెలా ఉన్నాయో మీరే ఓ లుక్కేయండి. అంతర్జాతీయంగా విదేశాల్లో ఉన్న ఎయిర్‌పోర్టులతో పోటీ పడుతున్నట్టుగా లేదు. ఎక్కడా తగ్గేది లేదంటున్న భారత్‌ విమానయాన రంగంలోనూ తనదైన శైలిలో దూసుకుపోతున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *