భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు వినగానే ప్రతి భారతీయుడి హృదయంలో గర్వభావం కలుగుతుంది. ఒక చిన్న పట్టణంలో సాధారణ కుటుంబంలో పుట్టి, చిన్నతనంలోనే జీవన పోరాటాలు ఎదుర్కొన్న మోదీ, తన కృషి, క్రమశిక్షణ, దేశభక్తి ద్వారా నేడు ప్రపంచం గౌరవించే మహానాయకుడిగా ఎదిగారు.
మోదీ నాయకత్వంలో భారత్ కేవలం ఆర్థికంగా మాత్రమే కాకుండా, ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా, అంతర్జాతీయ వేదికలపై కూడా ఒక బలమైన దేశంగా ఎదుగుతోంది. ఆయన కల కేవలం అభివృద్ధి చెందిన భారత్ మాత్రమే కాదు; ప్రతి భారతీయుడు తన సంస్కృతి, వారసత్వంపై గర్వపడేలా, దేశ ఆత్మను మేల్కొలిపేలా చేయడం.
ఆత్మనిర్భర్ భారత్ అనే స్వప్నాన్ని ఆయన ప్రతి ఇంటికి చేర్చారు. మనమే మన ఉత్పత్తులను తయారు చేసుకోవాలి, మనమే మన దేశాన్ని బలోపేతం చేయాలి అనే ఆలోచన ఆయన నేతృత్వంలో ఒక ప్రజా ఉద్యమంలా మారింది. పేదల పట్ల ఆయన చూపిన కరుణ, సంక్షేమ పథకాలు, ఆర్థిక పరమైన సాయం – ఇవన్నీ కోట్లాది ప్రజలకు ఊరట కలిగించాయి.
అంతర్జాతీయ వేదికలపై కూడా మోదీ ఒక దిట్టైన నాయకుడు. అమెరికా, రష్యా, యూరప్ వంటి మహా శక్తులతో సంబంధాలను బలోపేతం చేస్తూనే, గ్లోబల్ సౌత్ తరఫున వెనుకబడిన దేశాల సమస్యలను కూడా గళమెత్తి చెప్పారు. ఈ సమతుల్యత – సంప్రదాయం, ఆధునిక రాజనీతిని కలిపి నడిపించే ధోరణి – మోదీని నిజమైన రాజనీతిజ్ఞుడిగా నిలబెట్టింది.
వికసిత్ భారత్ 2047 ఆయన ఇచ్చిన పిలుపు కేవలం ఒక దిశానిర్దేశం కాదు, ప్రతి భారతీయుడి కర్తవ్యాన్ని గుర్తు చేసే clarion call. దేశం కోసం మనమూ ఏదో ఒక విధంగా సహకరించాలి, సమాజానికి ఉపయోగపడాలి అనే భావనను ఆయన ప్రతి ఒక్కరిలో నింపారు.
మోదీ జీవితం ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది – పట్టుదల, నిజాయితీ, ఆధ్యాత్మిక బలం ఉంటే ఒక వ్యక్తి తనను మాత్రమే కాదు, మొత్తం దేశాన్నీ మార్చగలడు. ఆయన పని చేసే తీరు – రాత్రింబగళ్లు శ్రమించడం, విశ్రాంతి లేకుండా ప్రజల కోసం తిరగడం – ప్రజాసేవకుడికి కావలసిన నిజమైన అంకితభావం.
ఈ రోజు ఆయన జన్మదినం సందర్భంగా, కోట్లాది భారతీయుల తరఫున మనం ప్రార్థించాల్సింది ఒక్కటే – ఆయనకు ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలి. ఆయన నాయకత్వంలో భారత్ మరింత అభివృద్ధి చెందుతూ, ఐక్యత, గౌరవం, గ్లోబల్ ప్రతిష్టలో ముందుకు సాగాలని మనసారా కోరుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీడియో సందేశం తెలియజేశారు. వీడియోను యధాతథంగా మీకు అందిస్తున్నాం.