
ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు పొంగుటూరు – లక్కవరం రహదారిని పరిశీలించారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఈ 6.1 కి.మీ కీలక రహదారి అభివృద్ధికి ప్రభుత్వం ₹1.5 కోట్లు మంజూరు చేసి ఆ నిధులతో చేపట్టిన మరమ్మత్తు పనుల పురోగతిని ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు.
