
ఈరోజు ఉదయం మంగళగిరి లోని క్యాంప్ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ను కలిసి, డిసెంబర్ 26-29 మధ్య తిరుపతిలో నిర్వహించనున్న భారతీయ విగ్యాన్ సమ్మేళన్ కార్యక్రమానికి ఆహ్వానించిన విజ్ఞాన భారతి ప్రతినిధులు. ఈ సందర్భంగా వారి ఆహ్వానాన్ని అందుకుని ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.

ఆ కార్యక్రమ ఆహ్వాన పత్రికను విజ్ఞాన భారతి సంస్థ జాతీయ సంయుక్త కార్యదర్శి శ్రీ ప్రవీణ్ రామదాసు గారు, జాతీయ కార్యదర్శి శ్రీ కొంపెళ్ళ S శాస్త్రి గారు, తదితరులు అందించారు.
