Native Async

పుట్టపర్తి అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించినందుకు ధన్యవాదాలు

Pallé Leaders Thank Deputy CM Pawan Kalyan for Allocating ₹35 Crore to Puttaparthi Development
Spread the love

· ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి శ్రీ పల్లె రఘునాథ రెడ్డి కృతజ్ఞతలు

·అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం

పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధికి సాస్కీ పథకం నుంచి రూ.35 కోట్ల నిధులు కేటాయించినందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆ నియోజకవర్గ శాసన సభ్యురాలు శ్రీమతి పల్లె సింధూర రెడ్డి గారు, మాజీ మంత్రి శ్రీ పల్లె రఘునాథ రెడ్డి గారు ధన్యవాదాలు తెలిపారు. రహదారి పనుల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆహ్వానించారు. శ్రీ సత్యసాయిబాబా వారి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారితో బుధవారం మధ్యాహ్నం ఇరువురు నేతలు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని అమడుగూరు, బుక్కపట్నం, కొత్త చెరువు, నల్లమడ, ఓబుల దేవర చెరువు తదితర ప్రాంతాల నుంచి పుట్టపర్తికి చేరే రహదారుల అభివృద్ధికి నిధులు కేటాయించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆ నియోజకవర్గం పరిధిలో 19 రోడ్లు, 72 కిలోమీటర్ల మేర నిర్మించేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా నిధులు కేటాయించిన విషయం విదితమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit